Begin typing your search above and press return to search.

రైలు పైకి ఎక్కిన రాహుల్ వీడియో... గట్టిగా వాయిస్తున్న నెటిజన్లు!

ఈ క్రమంలో తాజాగా ఓ వ్లాగర్ కదులుతున్న రైలు పైన పడుకుని కాసేపు, కూర్చుని కాసేపు ప్రయాణిస్తూ వీడియో చేశాడు.

By:  Tupaki Desk   |   18 Dec 2024 4:17 AM GMT
రైలు పైకి ఎక్కిన రాహుల్  వీడియో... గట్టిగా వాయిస్తున్న నెటిజన్లు!
X

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు విభిన్నమైన వీడియో కంటెంట్ కోసం అంటూ ఎంత రిస్క్ అయినా చేయడానికి వెనకాడటం లేదనే చెప్పాలి. ఈ సమయంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు కొంతమంది అయితే.. చావు వరకూ వెళ్లి వచ్చిన వారు ఇంకొంతమంది. ఇక చూసేవారికి జుగుప్స కలిగించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.

ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతుంటారు.. ఆ దిశగా పలువురిపై పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ వ్లాగర్ కదులుతున్న రైలు పైన పడుకుని కాసేపు, కూర్చుని కాసేపు ప్రయాణిస్తూ వీడియో చేశాడు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

అవును... బంగ్లాదేశ్ లో కదులుతున్న రైలు పైన ప్రయాణించాడు ఓ భారతీయ వ్లాగర్. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా.. మరోపక్క సోషల్ మీడియా జనాలు సదరు వ్లాగర్ ను వాయించి వదులుతున్నారు. ఇతడిపై చర్యలు తీసుకోవాలని.. అలాకానిపక్షంలో చాలా మంది ఈ దిశగా ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు.

రాహుల్ గుప్తా అనే వ్లాగర్ కదులుతున్న రైలుపై పడుకున వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే... ఈ స్టంట్ చాలా ప్రమాదకరమని అంగీకరిస్తూ, దీన్ని వీక్షకులు ప్రయత్నించొద్దని చెబుతున్నప్పటికీ... అతడు చేసిన ప్రయత్నంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఈ వీడియోలో రైలు పట్టలా వెంబడి వేగంగా కదులుతున్న సమయంలో దానిపై కూర్చుని ఉన్నాడు రాహుల్. ఈ సందర్భంగా.. తాను బంగ్లాదేశ్ లో రైలుపై ప్రయాణిస్తున్నానని.. అయితే, మీరు దీన్ని ప్రయత్నించకూడదని.. ఇది చాలా రిస్క్ తో కూడదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.