Begin typing your search above and press return to search.

ఇండియా వర్సెస్ భారత్... ప్రకాశ్ రాజ్ వైరల్ కామెంట్స్!

ఇండియా పేరును భారత్ గా మారుస్తున్నారా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Sep 2023 11:25 AM GMT
ఇండియా వర్సెస్ భారత్... ప్రకాశ్ రాజ్ వైరల్ కామెంట్స్!
X

ఇండియా పేరును భారత్ గా మారుస్తున్నారా అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. విపక్ష కూటమి తనపేరును ఇండియా గా మార్చుకున్న నేపథ్యంలో మోడీ ఈ విషయంపై సీరియస్ గా ఉన్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కొంతమంది స్వాగతిస్తుండగా.. చాలా మంది వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇప్పటివరకు అనేక నగరాల పేర్లను మార్చారు.. అది ఆహ్వానించదగ్గ పరిణామమే అవ్వొచు కానీ... ఇండియా పేరును భారత్ గా మార్చడం సహేతుకం కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా... జీ 20 సదస్సుకు రాబోతున్న ప్రపంచ దేశాల అధినేతలకు అందించిన ఆహ్వాన పత్రికలతో ఈ విషయంపై ఇపప్టికే మోడీ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేసిందని అంటున్నారు.

ఇందులో భాగంగా జీ20 సదస్సుకు వస్తున్న దేశాధినేతలకు అందించిన ఆహ్వానపత్రికల్లో... "ప్రెసిడెంట్ ఆఫ్ భారత్" అని ద్రౌపది ముర్ము, "ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్" అని మోడీ ల పేరున ఆహ్వానాలు పంపించారు. ఈ నిర్ణయంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీన్ని ఒంటెద్దుపోకడగా పలువురు అభివర్ణిస్తున్నారు.

ఈ సమయంలో తాజాగా ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇందులో భాగంగా తాను చెప్పాలనుకున్న విషయంలో సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో జాతీయ జెండా రంగును కూడా మారుస్తారేమో అంటూ ఒక పోస్ట్ పెట్టి, అందులో బీజేపీ జెండా రంగు ఫోటోను షేర్ చేశారు.

అవును... ఇండియా - భారత్ చర్చపై తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. "మీరు తలచుకుంటే పేర్లను మాత్రమే మార్చగలరు... భయంతో" అని మొదలుపెట్టిన ఆయన... "ఇండియన్స్ మి అయిన మేము తలచుకుంటే మీ ప్రభుత్వాన్నే మారుస్తాము... సగర్వంగా" అని ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా టీం ఇండియా క్రికెటర్ జెర్సీపై ఇండియాను కొట్టేసి, భారత్ అని రాస్తున్నట్లుగా ఉన్న సతీష్ ఆచార్య కార్టూన్ ను షేర్ చేశారు.

అనంతరం బీజేపీ ఫ్లాగ్ కలర్ లో ఉండే ఒక ఫోటోను పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్... "మన జాతీయ జెండా రంగులు మార్చి తమ నిజమైన రంగును వెల్లడిస్తారా?" అని కామెంట్ పెట్టారు.

అంతకంటే ముందు... "తన ఎన్నికల డ్రామా కోసం బట్టలు మార్చుకుని తన దేశం పేరును కూడా మార్చుకోవడానికి ప్రయత్నించే విదూషకుడి పేరు చెప్పండి" అంటూ మరో ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. ఇలా వరుసగా ప్రకాశ్ రాజ్ చేస్తున్న ట్వీట్లు ఎవరిని ఉద్దేశించినవి అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ ట్వీట్లు మాత్రం ఆన్ లైన్ వేదికగా వైరల్ అవుతున్నాయి!