Begin typing your search above and press return to search.

అరుణాచల్ విషయంలో ఎంటరైన అమెరికా... చైనాకు కీలక సూచనలు!

అవును... అరుణాచల్ ప్రదేశ్ తమ భుభాగమే అంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది

By:  Tupaki Desk   |   21 March 2024 6:44 AM GMT
అరుణాచల్ విషయంలో ఎంటరైన అమెరికా... చైనాకు కీలక సూచనలు!
X

భారత్ ను గిల్లే ప్రయత్నం చేయడం.. అనంతరం ప్రపంచ దేశాలతో మొట్టికాయలు తినడం ఇటీవల కాలంలో పాకిస్థాన్ తో పాటు చైనాకూ అలవాటుగా మారిపోతుంది! ప్రస్తుతం పాక్ ఆర్థికమాంద్యంతో కొట్టిమిట్టాడుతూ కాస్త సైలంట్ గా ఉన్నట్లు కనిపిస్తున్నా.. చైనా మాత్రం ఇలాంటి పనులు మానడం లేదు! ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని వ్యాఖ్యానించింది చైనా. దీంతో... ఈ వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.

అవును... అరుణాచల్ ప్రదేశ్ తమ భుభాగమే అంటూ చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఇందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ భారత్ భుభాగంగా అమెరికా గుర్తిస్తుందని తెలిపింది. ఇదే సమయంలో... భారత్ - చైనా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్ ఈ విషయాలను వెల్లడించారు.

ఈ నెల 9న ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటన అనంతరం చైనా స్పందించింది. ఇందులో భాగంగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు చైనా రక్షణశాఖ ప్రతినిధి జాంగ్ జియోగాంగ్ స్పందిస్తూ... అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభగమేనని.. చట్ట వ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన ఆ రాష్ట్రాన్ని తాము ఎప్పటికీ ఒప్పుకోమని చెప్పుకొచ్చారు. పైగా... అరుణాచల్ ప్రదేశ్ కు జిజాంగ్ అని పేరు కూడా పెట్టింది చైనా!

దీంతో ఈ ప్రేలాపనలపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. ఇందులో భాగంగా అసంబద్ధ వ్యాఖ్యలు చేయొద్దని చైనాకు సూచించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. ఈ సమయంలోనే అమెరికా కూడా స్పందించింది. ఈ సమయంలో చైనా వ్యాఖ్యలను ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ దే అని స్పష్టం చేసింది.

కాగా... అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా గతకొంతకాలంగా మరింతగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే! ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న భారత నేతల పర్యటనను జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ లోని సుమారు 11 ప్రాంతాల పేర్లను గతేడాది మార్చుతూ ప్రకటన చేసింది! అయితే చైనా అనుసరిస్తున్న చర్యలను భారత్ నిత్యం తిప్పికొడుతున్న సంగతి తెలిసిందే!