Begin typing your search above and press return to search.

ఇండియ‌న్ నేవీ సంచ‌ల‌నం.. ఇంటెన్స్ ఆప‌రేష‌న్ స‌క్సెస్‌

ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తా స‌ముద్ర తీరంలో స‌ముద్ర దొంగలు `MV రుయెన్‌` అనే వాణిజ్య నౌకను హైజాక్ చేశారు.

By:  Tupaki Desk   |   18 March 2024 8:16 AM GMT
ఇండియ‌న్ నేవీ సంచ‌ల‌నం.. ఇంటెన్స్ ఆప‌రేష‌న్ స‌క్సెస్‌
X

భార‌త నేవీ సంచ‌ల‌నం సృష్టించింది. తాజాగా చేప‌ట్టిన ఇండియ‌న్ నేవీ సంచ‌ల‌నం.. ఇంటెన్స్ ఆప‌రేష‌న్ స‌క్సెస్ చేసింది. తాజాగా భార‌త నౌకలను దోచుకునేందుకు ప్ర‌య‌త్నించిన స‌ముద్ర దొంగ‌ల‌ను నేవీ ద‌ళాలు అడ్డుకున్నాయి. దొంగ‌లు దోపిడీకి య‌త్నించిన నౌక‌లోని సిబ్బందిని కాపాడడంతోపాటు.. మొత్తం 35 మంది స‌ముద్ర దొంగ‌ల‌ను కూడా నేవీ అరెస్టు చేసింది. భార‌త నేవీ సాహ‌సోపేతంగా ఛేదించిన ఈ ఇంటెన్స్‌ ఆప‌రేష‌న్ కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తా స‌ముద్ర తీరంలో స‌ముద్ర దొంగలు `MV రుయెన్‌` అనే వాణిజ్య నౌకను హైజాక్ చేశారు. దీనిలోని సొత్తును దోచుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. ఈ విష‌యంపై స‌మాచారం తెలియ‌డంతో హుటాహుటిన రంగంలోకి దిగిన భార‌త నేవీ ద‌ళాలు `ఆప‌రేష‌న్ ఇంటెన్స్‌` చేప‌ట్టి.. MV రుయెన్‌ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాదు... దానిలోని సిబ్బందిని కూడా ర‌క్షించారు. ఇదేస‌మ‌యంలో 35 మంది సముద్రపు దొంగలను అరెస్టు చేశారు.

భారత యుద్ధ నౌక `INS కోల్‌కతా`లో వెళ్లిన ఇండియన్‌ నేవీ అధికారులు ఈ ఆపరేషన్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిలో భాగంగా ప్యాసెంజ‌ర్‌ విమానం C-17 గ్లోబ్‌మాస్టర్ నుంచి ధైర్యంగా పారాచూట్‌ల సాయంతో సముద్ర ఉపరితలంపైకి నేవీ కమాండోలు దూకారు. అనంతరం ప్రత్యేకమైన బోట్లలో హైజాక్‌ అయిన నౌక వద్దకు చేరుకున్నారు. ఆ నౌకను దొంగల చెర నుంచి విడిపించడంతోపాటు సిబ్బందిని సుర‌క్షితంగా కాపాడారు.

హైజాక్‌కు గురైన నౌక‌లోని రూ.8 కోట్లకుపైగా విలువైన 37,800 టన్నుల సామగ్రిని కాపాడారు. అదేస‌మ యంలో నౌకను బందీలు, సిబ్బందితో సహా ఇండియన్ ప‌శ్చిమ తీరానికి తీసుకొచ్చారు. ఈ నౌకలో భారీగా ఉక్కు ఉన్నట్లు పేర్కొన్నారు. వైమానిక, నౌకాదళాల ఉమ్మడి కార్యాచరణ శక్తిసామర్థ్యాలను ఈ విజయం ప్రదర్శిస్తోందని నేవీ తెలిపింది. కాగా, నేవీ సాహ‌సోపేత‌మైన ఈ ఆప‌రేష‌న్ స‌క్సెస్ కావ‌డంతో దేశ‌ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.