టెక్ కంపెనీ సె*స్ట్ ప్రమోషన్... భారతీయ సీఈవో రియాక్షన్ ఇదే!
వివరాళ్లోకి వెళ్తే... నెవాడాలోని లాస్ వెగాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఇద్దరు మహిళలను తలపై కంపెనీ బ్రాండెడ్ లాంప్ షేడ్ లను ధరించి కనిపించారు.
By: Tupaki Desk | 17 Aug 2024 4:51 AM GMTఒక యూఎస్ కంపెనీ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇద్దరు మహిళలు తమ తలపై కంపెనీ బ్రాండెడ్ లాంప్ షేడ్ లతో ఫోజులివ్వడం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై నెటిజన్లు, కంపెనీ సీఈవోపై విరుచుకుపడుతున్నారు. ఇది ఏమాత్రం స్వాగతించవలసిన చర్య కాదని నొక్కి చెబుతున్నారు. దీంతో... సీఈవో దిగివచ్చారు.
అవును... టెక్ కంపెనీ ప్రమోషన్స్ అంటే ఎలా ఉంటాయనేది తెలిసిందే. అయితే తాజాగా ఓ కంపెనీ ఓ సె*స్ట్ ప్రమోషన్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దీంతో.. నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు.. భారతీయ సంతతికి చెందిన ఆ కంపెనీ సీఈవో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఇలా కంపెనీపై భారీ ఎదురుదెబ్బ తగలడంతో ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు.
వివరాళ్లోకి వెళ్తే... నెవాడాలోని లాస్ వెగాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఇద్దరు మహిళలను తలపై కంపెనీ బ్రాండెడ్ లాంప్ షేడ్ లను ధరించి కనిపించారు. అంటే.. సదరు కంపెనీ తమ ప్రమోషన్ కి ఇలాంటి ఆలోచన చేసిందన్నమాట. ఈ నేపథ్యంలో ఎదురైన విమర్శలకు కంపెనీ సీఈవో బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇది "ఆమోదయోగ్యం కాదు" అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన... జరిగింది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. ఈ నేపథ్యంలో ఎక్కడ లోపం జరిగింది అనే విషయంలో ఇప్పటికే పరిశోధన జరిగింది.. మా మార్కెటింగ్ మార్గదర్శకాలను మేము స్థిరంగా అనుసరిస్తాము.. ఈ సమస్యను ఇంటర్నల్ గా పరిష్కరించాము.. అని వెల్లడించారు.
ఇక, బ్లాక్ హ్యాట్ కాన్ఫరెన్స్ పాలో ఆల్టో నెట్ వర్క్స్ స్పాన్సర్ చేసిన సైబర్ రిస్క్ కోపరేటివ్ హ్యాపీ అవర్ ఈవెంట్ లో ఈ ఘటన జరిగింది. మోడల్స్ ఫోటోలు సోషల్ మీడియాలోకి రావడంతో ప్రజలు ఆగ్రహించారు. "ఇది కంపెనీకి అవమానం.. షేమ్!" అని నెటిజన్లు కామెంట్ చేశారు. "మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా" అని మరొకరు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సీఈవో క్షమాపణలు చెప్పారు.