మన రూపాయికి అక్కడ రూ.500 !
మన భారతదేశ కరెన్సీ రూ.1 అక్కడ రూ.500తో సమానం. అంటే మనం మన కరెన్సీ ఒక్క రూపాయి ఇస్తే వాళ్లు వారి కరెన్పీ రూ.500 ఇస్తారు.
By: Tupaki Desk | 27 May 2024 11:30 AM GMTమన భారతదేశ కరెన్సీ రూ.1 అక్కడ రూ.500తో సమానం. అంటే మనం మన కరెన్సీ ఒక్క రూపాయి ఇస్తే వాళ్లు వారి కరెన్పీ రూ.500 ఇస్తారు. ఆ దేశం ఏదో తెలుసా. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ చమురు నిల్వలు కలిగిన దేశం ఇరాన్. మనం ఒక్క యూఎస్ డాలర్ కు రూ.83, ఒక్క కువైట్ దినార్ కు రూ.271 ఇస్తున్న పరిస్థితులలో ఇరాన్ మన రూపాయికి రూ.500 ఇస్తుండడం విశేషం.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులలో ఒకటిగా ఉన్న ఇరాన్ మీద అగ్రరాజ్యం అమెరికా విధించిన ఆంక్షలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. దాని కరెన్సీ విలువ చాలా తక్కువ. ఇరాన్ కరెన్సీని రియాల్-ఇ-ఇరాన్ అంటారు. అమెరికా భయంతో చాలా దేశాలు ఇరాన్ నుండి ముడిచమురు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తూ వస్తున్నది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ భారతదేశంతో సంబంధాలు బాగానే కొనసాగుతున్నాయి. ఒక భారతీయ రూపాయి 507.22 ఇరాన్ రియాల్స్‌తో సమానం. రూ.10 వేలతో ఒక భారతీయుడు ఇరాన్ వెళ్తే అక్కడ విలాసవంతమైన ప్రయాణంతో పాటు ఐదు నక్షత్రాల హోటళ్లలో బసచేయవచ్చు. అక్కడ ఫైవ్ స్టార్ హోటళ్లలో రూ.7000, మామూలు ఫైవ్ స్టార్ హోటళ్లలో రూ.2 వేల నుండి రూ.4 వేలు, త్రీస్టార్ హోటళ్లకు వెళ్తే అంతకు తక్కువ ఖర్చుతో పర్యటించి రావచ్చు.
భారతీయుడు 10,000 రూపాయలతో ఇరాన్‌కు వెళితే, అతను ఆ దేశంలో విలాసవంతంగా మరియు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దేశంలోని గొప్ప 5-నక్షత్రాల హోటల్‌లో బస చేయడానికి రోజుకు గరిష్టంగా ₹7,000 ఖర్చవుతుంది. కానీ మిడ్ రేంజ్ 5 స్టార్ హోటళ్లకు వెళితే రూ.2,000 నుంచి 4,000 మాత్రమే. అదేవిధంగా 3 స్టార్ హోటళ్లకు వెళితే ఇంతకంటే తక్కువ. ఇరాన్ భారత్ తో పాటు కొన్ని దేశాలతోనే తన స్థానిక కరెన్సీతో వాణిజ్యం చేస్తుంది. అక్కడ అమెరికన్ డాలర్లు కలిగిఉండడం తీవ్ర నేరం.