Begin typing your search above and press return to search.

బోర్డర్‌ లో పెద్ద ఇండియన్ ట్రాఫికింగ్ స్కామ్!

అవును... క్యూబెక్-న్యూయార్క్ రాష్ట్ర సరిహద్దు సమీపంలో కెనడా నుండి యుఎస్‌ కు 14 మంది భారతీయ పౌరుల స్మగ్లింగ్ ప్రయత్నం జరిగింది

By:  Tupaki Desk   |   28 July 2023 3:44 AM GMT
బోర్డర్‌  లో పెద్ద ఇండియన్  ట్రాఫికింగ్  స్కామ్!
X

గతకొన్ని రోజులుగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మాటలు ఎక్కువగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది బోర్డర్ లో జరుగుతోన్న హ్యూమన్ ట్రఫికింగ్ కి సంబంధించిన విషయం. అది కూడా... ఏకంగా 14మంది భారతీయ పౌరులకు సంబంధించిన వ్యవహారం.

అవును... క్యూబెక్-న్యూయార్క్ రాష్ట్ర సరిహద్దు సమీపంలో కెనడా నుండి యుఎస్‌ కు 14 మంది భారతీయ పౌరుల స్మగ్లింగ్ ప్రయత్నం జరిగింది. అయితే యుఎస్ బోర్డర్ పెట్రోల్ ఇటీవల దాన్ని అడ్డుకుంది. అయితే గత మూడు సంవత్సరాలలో ఈ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద వ్యవహారాల్లో ఇది ఒకటి అని అంటున్నారు.

ఈ సమయంలో అమెరికా అడ్డగించబడిన గ్రూప్ జనం ఒక ఎస్.యు.వి. కార్గో హోల్డ్‌ లో కిక్కిరిసిపోయి ఉన్నట్లు గుర్తించిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆ వెహికల్ డ్రైవర్ ఆ కిడ్నాపర్ కి సంబంధించిన వివరాలు వెళ్లడించాడు. తాను చూసిన వ్యక్తి గూఢచారి నవల్లోని వ్యక్తిని పోలి ఉన్నాడని చెప్పడం గమనర్హం.

ఆ వ్యక్తి రహస్యంగా నియమించబడ్డాడని.. గూఢచారి నవలని పోలి ఉన్నాడని.. వారి నుంచి ఒక ఫోన్, కొంత నగదు అందుకున్నాడని.. న్యూయార్క్ లో వీరిని పికప్ చేయమని చెప్పాడని డ్రైవర్ చెబుతున్నాడు. దీంతో... మరోసారి కెనడా - యూస్ బోర్డర్ లో జరుగుతోన్న ట్రాఫికింగ్ వ్యవహారం చర్చకు వచ్చింది.

అయితే గత ఎనిమిది సంవత్సరాలలో కంటే అధికంగా గత పది నెలల్లోనే సుమారు, 4,900 మందిని అదుపులోకి తీసుకొందని తెలుస్తుంది. వీరంగా ఇలా కెనడా నుంచి యూఎస్ కు ట్రాఫికింగ్ చేయబడుతున్న వారు. కెనడా-యూఎస్ మధ్య అత్యధిక సరిహద్దు ప్రాంతం కలిగి ఉండటంతో... ఇలాంటి వ్యవహారలు తరచూ జరుగుతున్నాయని అంటున్నారు.

గతలో సెయింట్ లారెన్స్ నది వెంబడి ఇండియన్, రొమేనియన్ జాతీయుల కు సంబంధించిన స్మగ్లింగ్ ప్రయత్నం కూడా జరిగింది. మెక్సికో, సెంట్రల్ అమెరికా నుండి పౌరులను తరలించే నెట్‌ వర్క్‌ లు జూలై 20న ఈ మార్గాన్ని ఉపయోగించాయి. ఈ నది గుండా స్మగ్లింగ్ చేసేవారు బోట్ యజమానులతో సంబంధాలు కలిగి ఉంటారని చెబుతున్నారు.

ఇందులో భాగంగా భారతదేశం నుండి స్మగ్లింగ్ నెట్‌ వర్క్‌ లు కెనడియన్ బ్రోకర్లు, అక్వేసాస్నే ఆధారిత బోట్ ఆపరేటర్‌ లతో సమన్వయం చేసుకుంటాయని అంటున్నారు. ఈ ప్రాంతంలోని భూ సరిహద్దు క్రాసింగ్‌ లలో ఎక్కువ భాగం మెక్సికన్, సెంట్రల్ అమెరికన్ జాతీయులను కలిగి ఉంటుందని అంటున్నారు.

కాగా... యుఎస్ - కెనడా సరిహద్దు క్రాసింగ్‌ ల వద్ద అనధికారిక శరణార్థులను తిప్పికొట్టడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. ఈ ఒప్పందం సరిహద్దుకు ఇరువైపులా ఉన్న అధికారులకు ఇరువైపులా శరణార్థులను వెనక్కి తిప్పడానికి అనుమతిస్తుంది.