విదేశాలకు చెక్కేస్తున్న భారత మిలియనీర్లు... అసలు కారణాలివే!!
వాస్తవానికి ప్రతీ ఏడాదీ వేలాది మంది మిలియనీర్ లను భారత్ కోల్పోతుండగా.. వారిలో మెజారిటీ మిలియనీర్లు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ)కు వలస వెళ్తున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 20 Jun 2024 2:45 AM GMTస్వదేశాన్ని వదిలి విదేశాలకు వలసవెళ్లిపోతున్న భారతీయ మిలియనీర్ల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందనే కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో హెన్లీ అండ్ పార్ట్ నర్స్ సంస్థ తాజాగా వెల్లడించిన లెక్కలు ఈ విషయాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ సంస్థ వెల్లడించిన ఘణాంకాలు షాకింగ్ గా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... ఇప్పటికే చాలామంది మిలియనీర్లు స్వదేశం విడిచి, విదేశాలకు వలస వెళ్లిపోయారని కథనాలొస్తున్న నేపథ్యంలో... అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహా సంస్థ.. హెన్లీ అండ్ పార్ట్ నర్స్ ఇటీవలి ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో సుమారు 4,300 మంది మిలియనీర్లు భారత్ వదిలి విదేశాలకు వెళ్లనున్నారని అంచనా తెరపైకి వచ్చింది.
ఇదే సంస్థ గత ఏడాది వెలువడించిన నివేదికలో 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు షిప్ట్ అయిపోయారని తెలిపింది. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చైనా, యూకే తర్వాత భారత్ మిలియనీర్ల వలసల పరంగా మూడోస్థానంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి ప్రతీ ఏడాదీ వేలాది మంది మిలియనీర్ లను భారత్ కోల్పోతుండగా.. వారిలో మెజారిటీ మిలియనీర్లు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ)కు వలస వెళ్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో భారత్ మాత్రమే ప్రత్యేకం కాదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,28,000 మంది మిలియనీర్లు 2024లో వలస వెళ్లనున్నారని ఈ సంస్థ అంచనా వేసింది.
వీరందరిలో మెజారిటీ మిలియనీర్ల గమ్యస్థానాల జాబితాలో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ తో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లు అగ్రస్థానంలో ఉన్నాయని అంటున్నారు. ఇలా వలస వెళ్లిన మిలియనీర్లు తమతో ఆస్తులను విదేశీ మారక నిల్వల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారని అంటున్నారు.
కాగా భద్రత, ఆర్థిక లెక్కలు, ట్యాక్స్ ప్రయోజనాలు, వ్యాపార అవకాశాలు, అనుకూలమైన జీవనశైలి, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, జీవన ప్రమాణాలతో సహా వివిధ కారణాల వల్ల భారతీయ మిలియనీర్ల కుటుంబాలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారని.. వారికి ఇవే ప్రధాన కారణాలని అంటున్నారు.