నడిసంద్రంలో ఇండియన్ నేవీ డేరింగ్ రెస్క్యూ... వీడియో వైరల్!
వివరాళ్లోకి వెళ్తే... గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన క్షిపణి దాడుల్లో బార్బడోస్ నుంచి బయల్దేరిన కార్గో నౌక ఘోరంగా దెబ్బతింది.
By: Tupaki Desk | 7 March 2024 11:29 AM GMTహమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయేల్ సైన్యానికీ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటినుంచీ ఎర్రసముద్రం వెంబడి హౌతీలు చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా సరుకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని ఈ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో "ట్రూ కాన్ఫిడెన్స్" అనే వాణిజ్య నౌకపై క్షిపణులతో దాడి చేశారు. ఈ సమయంలో భారత యుద్ధనౌక ఐ.ఎస్.ఎస్. కోల్ కతా అత్యంత సాహోసోపేత పనికి పూనుకుంది.
అవును... గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటు దారులు జరిపిన దాడిలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అత్యంత క్లిష్టపరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన భారత యుద్ధనౌక పలువురిని కాపాడింది. దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన క్షిపణి దాడుల్లో బార్బడోస్ నుంచి బయల్దేరిన కార్గో నౌక ఘోరంగా దెబ్బతింది. ఈ దాడుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరికొంతమంది గాయపడ్డారు. ఈ సమయంలో మృతిచెందినవారు, గాయపడిన వారితో మిగిలిన సిబ్బంది బిక్కుబిక్కుమంటూ గడపుతున్న పరిస్థితి. ఈ సమయంలో శరవేగంగా స్పందించింది ఐ.ఎస్.ఎస్. కోల్ కతా.
ఇందులో భాగంగా అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 21 మందిని రక్షించింది. అనంతరం వారికి అత్యవసర చికిత్సను సైతం అందించింది. వీటికి సంబంధించిన వివరాలు ఎక్స్ లో వెల్లడించింది ఇండియన్ నేవీ! ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం ఐ.ఎన్.ఎస్.లోని హెలీకాప్టర్, బోట్లను ఉపయోగించినట్లు తెలిపింది. ఇక యెమెన్ నగరం ఎడెన్ కు నైరుతి దిశగా సుమారు 55 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు ఇండియన్ నేవీ తెలిపింది.
ఇక దాడి సమయంలో ఆ నౌకలో మొత్తం 23 మంది ఉండగా... సిబ్బందిలో ఒకరు భారతీయుడు కూడా ఉన్నారు. ఇక 15మంది ఫిలిప్పీన్స్ దేశస్తులతోపాటు ముగ్గురు సాయుధ గార్డులు కూడా ఉన్నట్లు నౌక యాజమాన్యం వెల్లడించింది. ఈ సమయంలో చికిత్స పోందుతూ ఒకవ్య్కతి ప్రాణాలు కోల్పినట్లు చెబుతున్నారు.