మోడీ భజనలో సేదదీరుతున్న ప్రపంచం!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని దేశంలోని అనేక పార్టీలు పొగుడుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 16 Sep 2023 11:30 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీని దేశంలోని అనేక పార్టీలు పొగుడుతున్న విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీల నుంచి అనేక మంది నాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భజనలో ఆరితేరుతున్నారు. ఇక, బీజేపీ నాయకుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు కూర్చున్నా.. నిల్చున్నా.. కూడా మోడీ ఘనతేనని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక, ఇప్పుడు ప్రపంచం వంతు వచ్చింది. ప్రపంచ దేశాలు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ పాట పాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి స్థానంలో నిలిచారు. ఆయనకు ఏకంగా 76 శాతం మంది ప్రజల ఆమోదం ఉన్నట్టు తాజాగా జరిగిన సర్వేలో తేలిందట.
అమెరికాకు చెందిన `మార్నింగ్ కన్సల్ట్` విడుదల చేసిన సర్వేలో మోడీ మరోసారి నెంబర్ 1 స్థానంలో నిలిచారు. మోడీ నాయకత్వానానికి అప్రూవల్ రేటింగ్ 76 శాతంగా ఉండగా, డిసప్రూవల్ రేటింగ్ 18 శాతంగా, తటస్థంగా ఉండిన వారి రేటింగ్ 6 శాతంగా ఉందని తాజాగా జరిగిన సర్వేలో పేర్కొంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ.. ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ.. కీర్తిస్తున్నాయి.
ఇదీ.. ప్రపంచ నేతలకు ఉన్న ప్రజాదరణ జాబితా
1వ స్థానం భారత ప్రధాని నరేంద్ర మోడీ 76 శాతం ప్రజామోదం
2వ స్థానం స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ 64 శాతం ఆమోదం
3వ స్థానం మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్ లొపొజ్ అబ్రాడార్ 61 శాతం ప్రజామోదం
4వ స్థానం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 40 శాతం అప్రూవల్ రేటింగ్
5వ స్థానం కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూ 27 శాతం ప్రజామోదం
6వ స్థానం ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ 24 శాతం అప్రూవల్ రేటింగ్