Begin typing your search above and press return to search.

భారతీయుల హెచ్-1బీ వీసాలు గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయా?

యునైటెడ్ స్టేస్ ఆఫ్ అమెరికాలో టెక్ పరిశ్రమ గణనీయమైన తొలగింపులను ఎదుర్కొంటోంది.

By:  Tupaki Desk   |   3 Oct 2024 10:30 AM GMT
భారతీయుల హెచ్-1బీ వీసాలు గడ్డు పరిస్థితుల్లో  ఉన్నాయా?
X

యునైటెడ్ స్టేస్ ఆఫ్ అమెరికాలో టెక్ పరిశ్రమ గణనీయమైన తొలగింపులను ఎదుర్కొంటోంది. దీంతో... ఇది హెచ్-1బీ వీసాలపై ఉన్న భారతీయ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో... కఠినమైన వీసా నిబంధనలు, పెరుగుతున్న దరఖాస్తు రుసుములు వీరి ఇబ్బందులను మరింత పెంచుతున్నాయని అంటున్నారు.

లేఅఫ్.ఎఫైఐ నివేదిక ప్రకారం... 438కి పైగా టెక్ కంపెనీలు సుమరు 1,37,500 మంది ఉద్యోగులను తొలగించాయి. దీంతో... హెచ్-1బీ వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగులు కొత్త ఉపాధిని త్వరగా కనుగొనడం.. లేదా, బహిష్కరణను ఎదుర్కోవాల్సిన కఠినమైన సమయం కారణంగా తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారని అంటున్నారు.

యూఏస్ కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదికల ప్రకారం... ఇప్పటికే చాలా మంది భారతీయ ఉద్యోగులు గ్రీన్ కార్డుల కోసం దశాబ్ధాలుగా బ్యాక్ లాగ్ లను ఎదుర్కొంటున్నారని.. మరికొంతమంది శాస్వత నివాసం కోసం ఏకంగా 190ఏళ్లుగా వేచి ఉన్నారని.. ఈ సుదీర్ఘ అనిశ్చితి వారి పరిస్థితిని మరింత సమస్యాత్మకంగా మారుస్తోందని చెబుతున్నారు.

అయితే... యూఎస్ వీసా విధానాలలో ఇటీవల చోటు చేసుకున్న పలు మార్పులు ఈ సవాళ్లను తీవ్రతరం చేస్తున్నాయనే చెప్పాలి. ఇందులో భాగంగా... హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు రుసుము ఒక్కోక్కరినీ $10 నుంచి $215కి పెరిగింది. అంటే... ఈ పెరుగుదల 2150శాతం అన్నమాట.

ఇదే సమయంలో పేపర్ ఫైలింగ్ ఫీజు కూడా $460 నుంచి $780కి పేరిగింది. అంటే.. ఇక్కడ పెరుగుదల 70%గా ఉంది. ఇలా కఠినతరమైన ఇమ్మిగ్రేషన్ ల్యాండ్ స్కేప్ లో.. తొలగింపులు, దీర్ఘకాల గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లు, పెరిగిన వీసా ఫీజుల కారణంగా భారతీయ ఉద్యోగులు యూఎస్ లో స్థిరమైన ఉపాధి, రెసిడెన్సీని పొందేందుకు కష్టపడుతున్నరని అంటున్నారు.