శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్ట్ !
ఈ దాడుల్లో వారి వద్ద నుంచి 158 మొబైల్ ఫోన్లు, 16 ల్యాప్‌టాప్‌లు, 60 డెస్క్‌టాప్ కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
By: Tupaki Desk | 29 Jun 2024 9:30 AM GMTబెట్టింగ్, జూదం తదితర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ సైబర్ స్కామ్ చేస్తున్నారన్న ఆరోపణలతో శ్రీలంకలో 137 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్టు చేశారు. శ్రీలంకలోని కొలంబో శివారు మడివేలా, బత్తరముల్లా, నెగొంబా ప్రాంతాల్లో వీరందరినీ అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి ఎస్‌ఎస్‌పీ నిహాల్ తల్దువా వెల్లడించారు.
ఈ దాడుల్లో వారి వద్ద నుంచి 158 మొబైల్ ఫోన్లు, 16 ల్యాప్‌టాప్‌లు, 60 డెస్క్‌టాప్ కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. నెగొంబాలో 55 మంది అనుమానితులతో పాటు 55 మొబైల్ ఫోన్లు, 29 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొచ్చికాడేలో అధికారులు 53 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 31 ల్యాప్‌టాప్‌లు, 58 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
మడివేలలో చేపట్టిన ఆపరేషన్‌లో 13 మంది అనుమానితులను అరెస్టు చేసి, 8 ల్యాప్‌టాప్‌లు, 38 మొబైల్ ఫోన్‌లను సీజ్ చేశారు. తలంగమలో 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, 8 ల్యాప్‌టాప్‌లు, 38 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.