యూకేలో ఇద్దరు భారతీయ యువకులకు జీవిత ఖైదు!
యునైటెడ్ కింగ్ డం (యూకే) 16 ఏళ్ల రోనన్ కండా హత్యకు పాల్పడినందుకు 17 ఏళ్ల ప్రబ్జీత్ వేధేసా, సుఖ్ మాన్ షెర్గిల్ లకు జీవిత ఖైదు విధించింది స్థానిక కోర్టు.
By: Tupaki Desk | 16 July 2023 10:03 AM GMTగతకొంతకాలంగా విదేశాల్లో ఉన్న భారతీయ యువకులకు సంబంధించిన క్రైం న్యూస్ లు ఎక్కువగా వినిపిస్తున్నాయన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో... యూకేలో జీవిత ఖైదు శిక్ష విధింపబడిన ఇద్దరు యువకుల వార్త వెలుగులోకి వచ్చింది.
యునైటెడ్ కింగ్ డం (యూకే) 16 ఏళ్ల రోనన్ కండా హత్యకు పాల్పడినందుకు 17 ఏళ్ల ప్రబ్జీత్ వేధేసా, సుఖ్ మాన్ షెర్గిల్ లకు జీవిత ఖైదు విధించింది స్థానిక కోర్టు. రోనన్ ప్లే స్టే షన్ కంట్రోలర్ ని కొనుగోలు చేయడానికి వెళ్లిన సమయంలో అతను కత్తిపోట్లకు గురయ్యాడని తెలుస్తుంది.
వోల్వర్ హాంప్టన్ క్రౌన్ కోర్టులో విచారణ సందర్భంగా... వేధేసా, షెర్గిల్ లు రోనన్ పై వెనుక నుండి దాడి చేశారని, అతని గుండెను గుచ్చుకునేలా పొడిచారని తెలిసిందని అంటున్నారు. అయితే ఈ హత్య వెనక చాలా కథే ఉందని తెలుస్తుంది. దీనివెనక ఆర్ధికపరమైన శతృత్వాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
అవును... హత్య కాబడిన రోనన్ స్నేహితుల్లో ఒకరితో ప్రబ్జీత్ వేధేసాకు ఆర్థిక వివాదం ఉందని అంటున్నారు. అయితే రోనన్ విషయంలో పొరపాటుగా గుర్తించిన వేధేసా - సుఖ్ మాన్ షెర్గిల్.. రోనన్ పై దాడిచేశారని అంటున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న ఈ ఇద్దరు యువకులు... ఆయుధాలు, దుస్తులు వదిలి పారిపోయారని అంటున్నారు.
అయితే చంపబడిన వ్యక్తి వేరయినా... హత్యకు ప్లాన్ చేసిన విషయం మాత్రమే కరెక్ట్ అని అంటున్నారంట. ఇందులో భాగంగా... సంఘటన జరిగిన రోజు ఆన్ లైన్ లో కత్తులు, కొడవలిని కొనుగోలు చేశారని గుర్తించారంట. దీంతో వేధేసాకు 18 సంవత్సరాల జైలు శిక్ష విధించబడిందని అంటున్నారు.
ఇదే సమయంలో రోనన్ హత్య విషయంలో ప్రబ్జీత్ వేధేసా కు సహకరించిన సుఖ్ మాన్ షెర్గిల్ కు 16 ఏళ్ల జైలు శిక్ష పడిందని అంటున్నారు. ఈ దాడిలో రోనన్ వెనుక, తుంటి ప్రాంతంలో 20 సెం.మీ... ఛాతీలో 17 సెం.మీ. ల లోతులో గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తుంది. మరోపక్క... ఈ సందర్భంగా విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన రోనన్ కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంధ్రంలో మునిగిపోయారని తెలుస్తుంది.