Begin typing your search above and press return to search.

నివేదిక చెప్పిన నిజం.. ఆ జబ్బును భారతీయులు అస్సలు ఒప్పుకోరట!

ఈ భయాన్ని తొలగించటం మానసిక ఆరోగ్య సాధనలో తొలిమెట్టుగా ఐఐటీ జోధ్ పుర్ కు చెందిన వైద్యులు చెబుతున్నారు

By:  Tupaki Desk   |   31 Jan 2024 6:19 AM GMT
నివేదిక చెప్పిన నిజం.. ఆ జబ్బును భారతీయులు అస్సలు ఒప్పుకోరట!
X

తాజాగా విడుదలైన నివేదిక ఒక నిజాన్ని వెల్లడించటమే కాదు.. మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయులు తమను తాము మార్చుకోవాల్సిన అంశాన్ని చెప్పేసింది. గతంలో మాదిరే.. తాజా డిజిటల్ యుగంలోనూ భారతీయులు తమ మానసిక అస్వస్థతను చెప్పుకోవటానికి అస్సలు ఇష్టపడరన్న నిజాన్ని వెల్లడించింది. తమ మానసిక సమస్యల్ని తమంతట తామే చెప్పుకునే వారు ఒక్క శాతం కంటే తక్కువన్న విషయాన్ని సర్వే వెల్లడించింది. మానసిక ఆరోగ్యం ఉందని అంగీకరిస్తే సమాజం తమ పట్ల చిన్నచూపు చూస్తారన్న భయం దీనికి కారణమని పేర్కొన్నారు.

ఈ భయాన్ని తొలగించటం మానసిక ఆరోగ్య సాధనలో తొలిమెట్టుగా ఐఐటీ జోధ్ పుర్ కు చెందిన వైద్యులు చెబుతున్నారు. అమెరికాలోని అహాయో వర్సిటీకి చెందిన జుయెల్ క్యాస్ట్రోతో కలిసి అధ్యయనం చేసిన ఆయన పరిశోధన తాజాగా ఒక అంతర్జాతీయ సైన్స్ జర్నల్ లో పబ్లిష్ అయ్యింది.

భారతదేశంలో మానసిక ఆరోగ్య సేవల్ని అందిస్తున్నది ప్రధానంగా ప్రైవేటు ఆసుపత్రులే కావటంతో భారీగా బిల్లుల మోత మోగుతున్నట్లుగా పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని వెల్లడించారు. ఈ బిల్లులు సామాన్యులు భరించలేనంత స్థాయిలో ఉంటాయని పేర్కొన్నారు. మానసిక అస్వస్థతుల్లో 66శాతానికి పైగా అవుట్ పేషెంట్లుగా చెప్పారు.

ఆసుపత్రుల్లో సేవలు అందించే మానసిక రోగుల్లో 59 శాతం మంది ప్రైవేటు రంగానికి చెందిన ఆసుపత్రుల్లోనే చేస్తారని చెబుతున్నారు. అల్పాదాయ వర్గాలతో పోలిస్తే అధిక ఆదాయ వర్గాలు 1.73 రెట్లు ఎక్కువగా మానసిక అస్వస్థత గురించి వైద్యులకు చెబుతారని తమ సర్వేలో తేలినట్లుగా చెబుతున్నారు. మానసిక రోగుల్లో ఇన్స్యూరెన్స్ సౌకర్యం కేవలం 23 శాతానికి మాత్రమే ఉంది. మారిన కాలానికి తగ్గట్లు.. మానసిక అనారోగ్యాన్ని గుట్టుగా దాచుకోకుండా బయటకు చెప్పుకోవటం.. తగిన చికిత్స చేయించుకోవటం చాలా అవసరం.