అమెరికాలో భారత విద్యార్థి కాల్పులు.. అరెస్టు!
ఇక్కడివారే జాత్యాహంకారంతో కాల్పులు జరిపిన ఘటనలు మెండు.
By: Tupaki Desk | 17 April 2024 6:00 AM GMTఔను.. మీరు చదివింది నిజమే. అమెరికాలో భారత విద్యార్థే కాల్పులకు తెగబడ్డాడు. వాస్తవానికి అమెరికాలో తుపాకీ సంస్కృతి ఉంది. ఇక్కడివారే జాత్యాహంకారంతో కాల్పులు జరిపిన ఘటనలు మెండు. కానీ, భారతీయ విద్యార్థి ఇలా కాల్పులకు పాల్పడడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో ఈ వార్త అమెరికా, భారత్‌లలో సంచలనంగా మారింది.
ఎవరు?
భారత్‌లోని యూపీకి చెందిన అమోఘ్ ఉపాధ్యాయ ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పట్టారు. అక్కడి శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో గ్యాడ్యుయేషన్ చదువుతున్నాడు. ప్రస్తుతం రెండో సంవత్సరంలో ఉన్నాడు. అంతేకాదు.. భవిష్యత్తుపైనా చాలానే ఆశలు ఉన్నాయి. ఆయన లింక్డ్ ఇన్ చూస్తే.. భావి జీవితానికి ఎలాంటి బాటలు వేసుకున్నాడో తెలుస్తుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్‌లో ఉన్నత శిఖరాలు అందుకోవాలన్నది ఉపాధ్యాయ లక్ష్యం. సో.. మంచి ప్రస్థానమే. కానీ, ఎక్కడో తేడా కొట్టింది.
ఏం జరిగింది?
శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీలో రెండవ-సంవత్సరం గ్రాడ్యుయేట్ అయిన అమోఘ్ ఉపాధ్యాయ క్యాంపస్‌లోని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లైబ్రరీలో కాల్పలకు తెగబడ్డాడు. రెండు రౌండ్లు తుపాకీతో కాల్పలు జరిపాడు. అయితే.. ఈ ఘటనలో ఎవరు గాయపడ్డారు? ఎవరైనా చనిపోయారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఈ ఘటన విషయంపై యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్, ఆఫీస్ ఆఫ్ ది స్టేట్ ఫైర్ మార్షల్, ఆర్సన్ అండ్ బాంబ్ యూనిట్ లు రంగంలోకి దిగి.. ఉపాధ్యాయను అదుపులోకి తీసుకున్నాయి.
రెండుసార్లు కాల్పులు?
ఉపాధ్యాయ రెండు సార్లు కాల్పులు జరిపినట్టు సమాచారం. మార్చి 31, ఈనెల 8న కూడా ఆయన కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. నిఘా ఫుటేజ్‌ను పరిశీలించారు. ఏప్రిల్ 12న అతడిని అరెస్టు చేసేశారు. రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్‌లో అతనికి విశేష అనుభవం ఉందని గుర్తించారు. అయితే.. కాల్పులు జరపడానికి కారణాలేంటనేది తెలియరాలేదు. ఉపాధ్యాయ బయటకు రావాలంటే.. 4 లక్షల డాలర్లు(భారత కరెన్సీలో 3.2 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది.