Begin typing your search above and press return to search.

భారత యువత దుబాయ్ కు ఎందుకు ఆకర్షితులవుతున్నారో తెలుసా?

సాధారణంగా ఉన్నత చదువులకు, ఉద్యోగాలకూ భారత యువత చూపు ఎప్పుడు అగ్రరాజ్యం అమెరికా వైపే ఉంటుందని అంటుంటారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 12:30 PM GMT
భారత యువత దుబాయ్  కు ఎందుకు ఆకర్షితులవుతున్నారో తెలుసా?
X

సాధారణంగా ఉన్నత చదువులకు, ఉద్యోగాలకూ భారత యువత చూపు ఎప్పుడు అగ్రరాజ్యం అమెరికా వైపే ఉంటుందని అంటుంటారు. అయితే ఇప్పుడు మరో దేశంవైపు కూడా వారు ఆకర్షితులవుతున్నరని అంటున్నారు. అక్కడ చదువు కోసం అయ్యే ఖర్చు తక్కువ.. అదే సమయంలో చదువుకుంటూ పనిచేసే ఆప్షన్స్ ఎక్కువ అని చెబుతున్నారు. అదే... దుబాయ్!

అవును... ఇటీవల కాలంలో దుబాయ్ కి వెళ్లే భారతీయ యువత సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. అక్కడ భారతీయ యువతను ఆకర్షించే పలు అంశాలు ఉండటమే దీనికి కారణం అని చెబుతున్నారు. ఇందులో భాగంగా దుబాయ్ లో సుమారు 35 లక్షలకు పైగా భారతీయులు ఉంటారని చెబుతున్నారు.

అక్కడున్న సిబ్బందిలో ప్రతీ 23 మందిలో ఒక్కరు మాత్రమే ఆదేశానికి చెందినవారని అంటున్నారు. ఇదే క్రమంలో... ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశల్లో దుబాయ్ ముందు వరుసలో ఉందని చెబుతున్నారు. అదే విధంగా... ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని అంటున్నారు.

ఉదాహరణకు... దుబాయ్ లో యూజీ / పీజీ కు పెట్టే ఖర్చు రూ.17 లక్షల వరకూ ఉంటుందని చెబుతున్నారు. అమెరికా, యూరప్ లతో పోలిస్తే ఇది చాలా తక్కువ అనేది విద్యార్థులకు ప్రధాన అంశం అని అంటున్నారు. ఇక్కడ యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్ హోమ్, యూనివర్శిటీ ఆఫ్ యూరప్, హెరియట్-వాట్ వంటి విదేశీ వర్సిటీలు ఉన్నాయి.

ఇదే క్రమంలో... చదువు పూర్తయ్యక ఉపాధి దొరికేంత వరకూ పనిచేసుకొవడానికి దుబాయ్ విధానాలు వీలు కల్పిస్తున్నాయి. పైగా భారత్ నుంచి దుబాయ్ కి మూడు గంటల విమాన ప్రయాణం. దీనికి తోడు టిక్కెట్ ధరలు తక్కువగానే ఉంటాయి.. పెద్ద ఇబ్బందులేవీ లేకుండానే వీసా లభిస్తుంటుంది. దీంతో.. సహజంగానే భారతీయ విద్యార్థుల చూపు దుబాయ్ పై పడుతోందని అంటున్నారు.

ఇక ప్రధానంగా.. అన్నింటికీ మించి ఇక్కడ సగటు వార్షిక శాలరీలు అధికంగా ఉంటున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా ఆ సంఖ్య రూ.23 లక్షల వరకూ ఉంతుందని చెబుతున్నారు. ఇక నేరాల రేటు కూడా తక్కువగా ఉండటం వల్ల వృత్తి నిపుణులు తమ తమ కుటుంబాలతో ఇక్కడకు రావడానికి ఇష్టపడుతున్నరని అంటున్నారు.