ఆ విషయంలో మనది మూడో స్థానం !
ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న దేశాలలో భారత్ మూడో స్థానంలో నిలిచింది
By: Tupaki Desk | 9 July 2024 4:43 AM GMTప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న దేశాలలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అయితే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న జపాన్ బిలియనీర్ల సంఖ్యలో 16వ స్థానంలో ఉండడం విశేషం. ఇక ఎక్కువ జీడీపీ ఉన్న జర్మనీలోనూ వీరి సంఖ్య తక్కువగా ఉండడం గమనార్హం.
తాజాగా వెల్లడించిన ఫోర్బ్స్ జాబితాలో భారత్ లో 200 మంది, అమెరికాలో అత్యధికంగా 813 మంది, చైనాలోొ 406 మంది బిలియనీర్లు ఉన్నారు. 69 మంది బిలియనీర్లతో బ్రెజిల్ ఏడో స్థానంలో, నలుగురు బిలియనీర్లతో పాకిస్థాన్ చివరి స్థానంలో నిలబడింది. 11.6 బిలియన్ డాలర్ల సంపదతో షాహిద్ ఖాన్ పాకిస్థాన్ లో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు.
జర్మనీ 132, రష్యా 120, ఇటలీ 73, బ్రెజిల్ 69, హాంకాంగ్ 67, కెనడా 67, బ్రిటన్ 55, ఫ్రాన్స్ 53, తైవాన్ 51, ఆస్ట్రేలియా 48, స్వీడన్ 43, స్విట్జర్లాండ్ 41, జపాన్ 41, సింగపూర్ 39, ఇజ్రాయెల్ 36, దక్షిణ కొరియా 36, ఇండోనేషియా 35, స్పెయిన్ 29, టర్కీ 27, థాయిలాండ్ 26, మెక్సికో 22, మలేషియా 17, ఫిలిప్పీన్స్ 16, నెదర్లాండ్స్ 14, నార్వే 12, చెక్ రిపబ్లిక్ 11, ఐర్లాండ్ 11, సైప్రస్ 10, గ్రీస్ 10, బెల్జియం 10, ఆస్ట్రియా 9, డెన్మార్క్ 9, పోలాండ్ 8, ఫిన్లాండ్ 7, చిలీ 6, కజకిస్తాన్ 6, వియత్నాం 6 మంది బిలీయనీర్లతో వరస స్థానాలలో నిలవడం గమనార్హం.