Begin typing your search above and press return to search.

భారతీయ మహిళలు పర్సులో కండోమ్స్.. పర్సంటేజ్ ఎంతంటే...?

ఈ క్రమంలో 2022లో బెంగళూరులోని ఓ స్కూల్‌ లో విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్‌ లు, గర్భనిరోధక మాత్రలు కనిపించడం దేశంలోని అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Jan 2024 5:28 AM GMT
భారతీయ మహిళలు పర్సులో కండోమ్స్.. పర్సంటేజ్  ఎంతంటే...?
X

కాలం మారిపోయిందని అనాలో.. జాగ్రత్త పెరిగిందని సర్ధుకోవాలో.. ఇంకా ఎలాగైనా చెప్పుకోవాలో తెలియదు కానీ... తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సర్వే ప్రకారం... భారతదేశంలో మహిళల హ్యాండ్ బ్యాగుల్లోనూ, విద్యార్థుల బ్యాగుల్లోనూ కండోమ్స్ ప్యాకెట్లు పెట్టుకోవడం కొంత శాతం మందికి సర్వసాధారణమైన విషయం అని తేలిందని తెలుస్తుంది. దీంతో... "గుండమ్మ కథ" సినిమాలో పాటలు హం చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు!

అవును... సాధారణంగా మహిళల పర్సులు, హ్యాండ్ బ్యాగుల్లో దువ్వెన, చిన్న మిర్రర్, లిప్ స్టిక్, టచప్ ప్యాడ్ లాంటివి ఉంటాయనేది తెలిసిన విషయమే! అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని.. ఆ పర్సుల్లో, ఆ హ్యాండ్ బ్యాగుల్లో... వాటితో పాటు కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు సైతం ఉంటుంన్నాయని.. వీరి సంఖ్య అమెరికాలోనే కాదు ఇండియాలోనూ పెరుగుతుందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... తాజా సర్వే ప్రకారం భారతదేశంలోని 3% మంది మహిళలు సురక్షితమైన సెక్స్ కోసం తమ పర్సులో ఎల్లప్పుడూ కండోమ్‌ లను కలిగి ఉంటున్నట్లు అంగీకరించారు! లైంగిక ఆరోగ్య నిపుణులు కండోమ్‌ లు, అత్యవసర మాత్రలు మహిళల లైంగిక ఆరోగ్యానికి ముఖ్యమైన సాధనాలు అని నొక్కి చెబుతున్న నేపథ్యంలో.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో 2022లో బెంగళూరులోని ఓ స్కూల్‌ లో విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్‌ లు, గర్భనిరోధక మాత్రలు కనిపించడం దేశంలోని అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఆవిద్యార్థుల జాబితాలో అమ్మాయిలు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం సమాజంలో కండోమ్‌ లు పొందడం సులభం అనేది తెలిసిన విషయమే. కారణం.. అవి కొనడానికి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు.

వాస్తవానికి 9.5% మంది పురుషులు మాత్రమే కండోమ్‌ లను ఉపయోగిస్తున్నారని.. అందుకు ఆసక్తి చూపుతారని చెబుతున్నారు. దీంతో... భారతదేశంలో ఇతర సంబంధాల ఫలితంగా గర్భాలను నివారించే బాధ్యత మహిళలపై ఎక్కువగా పడుతుంది. దీంతో ఇటీవల కాలంలో కండోమ్‌ లను తమ హ్యాండ్ బ్యాగ్ లలో క్యారీ చేసే మహిళల సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు.

ఏది ఏమైనా... భారతదేశంలో యువతలో లైంగిక ప్రయోగాలు, పోర్న్ చూడటం వంటివి పెరుగుతున్న నేపథ్యంలో... యుక్తవయస్సులో గర్భాలను నివారించడానికి, లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లైంగిక విద్య చాలా అవసరమని గైనకాలజిస్టులు చెబుతున్నారు.