Begin typing your search above and press return to search.

లక్ష కోట్ల వ్యూస్ కు చేరుకున్న యూట్యూబ్ షార్ట్స్!

తాజాగా భారత్ లో ఈ షార్ట్స్ లక్ష కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. లక్ష కోట్ల అంకెను వేయాలంటే కాస్తంత కష్టపడాల్సిందే

By:  Tupaki Desk   |   8 Aug 2024 5:09 AM GMT
లక్ష కోట్ల వ్యూస్ కు చేరుకున్న యూట్యూబ్ షార్ట్స్!
X

స్మార్ట్ ఫోన్ వాడకం పెరగటం.. అందులో చౌకగా ఉండే డేటా ప్లాన్ పుణ్యమా అని భారతదేశంలో డిజిటల్ విప్లవం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హస్తభూషణంగా మారిన స్మార్టు ఫోన్ ను వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాడేస్తున్న పరిస్థితి. స్మార్ట్ ఫోన్ ఉన్నంతనే వీడియోల్ని విరివిరిగా వీక్షించే ధోరణి మరింత ఎక్కువైంది. ఇలాంటి వేళలోనే.. 60సెకన్ల నిడివి ఉండే వీడియోలకు ఆదరణ మరింత పెరిగింది. నిమిషం వ్యవధిలో ఉన్న వీడియోను చూడటం.. ఆ వెంటనే మరో వీడియోకు వెళ్లే యూట్యూబ్ షార్ట్స్ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.

తాజాగా భారత్ లో ఈ షార్ట్స్ లక్ష కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. లక్ష కోట్ల అంకెను వేయాలంటే కాస్తంత కష్టపడాల్సిందే. ఒకటికి మూడుసార్లు చెక్ చేసుకోవాల్సిందే. అలాంటి ఘనతను కేవలం మూడున్నరేళ్ల వ్యవధిలో యూట్యూబ్ భారత్ లో సాధించింది. 2020లో యూట్యూబ్ షార్ట్స్ ను ఆవిష్కరిస్తే.. అదిప్పుడు భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. యూట్యూబ్ బ్రాండ్ క్యాస్ట్ 2024 ప్రోగ్రాంలో యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

భారత క్రియేటర్లు వీడియోలను రూపొందించే విషయంలో లోకల్ అంశాల నుంచి స్పూర్తి పొందారని.. వాటిల్లో కొన్ని ఇంటర్నేషనల్ సంప్రదాయాల్ని సైతం నిర్వచించే స్థాయిలో ఉండటాన్ని ప్రస్తావించారు. గడిచిన మూడేళ్లలో కనెక్టెడ్ టీవీల్లో యూట్యూబ్ ను చూసే వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగినట్లు పేర్కొన్నారు. 2020లో తొలిసారి యూట్యూబ్ షార్ట్స్ అందుబాటులోకి తీసుకురాగా.. అవిప్పుడు లక్ష కోట్ల వ్యూస్ మైలురాయిని సొంతం చేసుకోవటం విశేషం. తనకు లభిస్తున్న ఆదరణకు అనుగుణంగా యూట్యూబ్ షార్ట్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తేవటం తెలిసిందే. ఈ మధ్యనే టిక్ టాక్ వీడియోలలో తరచూ వినిపించే రోబోటిక్ వాయిస్ ల మాదిరి క్రత్రిమ వాయిస్ ఓవర్లను జోడించే ఫీచర్ ను తీసుకొచ్చారు. ఇదే రీతిలో బోలెడన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తూ.. మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు.