Begin typing your search above and press return to search.

మూడ్ ఆఫ్ ది నేషన్... లోక్ సభ ఎన్నికలపై ఇండియా టుడే సర్వే!

అవును... మోడీకి 400 సీట్ల వరకూ సాధ్యమే? అంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వచ్చే ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వెల్లడించింది

By:  Tupaki Desk   |   8 Feb 2024 12:59 PM GMT
మూడ్ ఆఫ్ ది నేషన్... లోక్ సభ ఎన్నికలపై ఇండియా టుడే సర్వే!
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలూ వ్యూహ ప్రతివ్యూహాల్లో బిజీగా ఉండగా... కొన్ని మీడియా సంస్థలూ, సర్వే సంస్థలూ... రకరకాల పేర్లతో ఫలితాలపై వారి వారి అంచనాలను వెళ్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా "మూడ్ ఆఫ్ ది నేషన్" పేరున జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే తాజాగా తమ అంచనాలను వెల్లడించాయి. ఈ సందర్భంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి దాదాపుగా భారీస్థాయిలో అనుకూలమైన ఫలితాలు వస్తాయన్నట్లుగా తెలిపింది!

అవును... మోడీకి 400 సీట్ల వరకూ సాధ్యమే? అంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వచ్చే ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వెల్లడించింది. ఈ సందర్భంగా కొన్ని అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనే కామెంట్లను సొంతం చేసుకోగా.. మరికొన్ని అంచనాలు మాత్రం వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలను ప్రజలపై రుద్దే ప్రయత్నంలో భాగంగా అనిపిస్తున్నాయనే విమర్శలను సొంతం చేసుకుంటున్నాయి. ఆ సంగతులు అలా ఉంటే... ఇండియా టుడే వెళ్లడించిన అంచనా ఫలితాలను ఇప్పుడు చూద్దాం...!

ఉత్తరప్రదేశ్:

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో వార్ వన్ సైడ్ అని అంచనా వేసింది ఇండియా టుడే. ఇందులో భాగంగా యూపీలోని 80 లోక్ సభ స్థానాల్లోనూ 72 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని.. ఇండియా కూటమి 8 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

ఢిల్లీ:

దేశ రాజధానిలో కూడా ఎన్డీఏ కూటమి తన సత్తా చాటే అవకాశాలున్నాయని ఇండియా టుడే అంచనా వేసింది. ఇందులో భాగంగా... ఎన్డీఏ 54%, ఇండియా కూటమి (ఆప్ - 15, కాంగ్రెస్ - 25) 40%, ఇతరులు 3% ఓట్ల షేర్ పొందే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో మొత్తం 7 స్థానాలు ఉంటే మొత్తం స్థానాలను ఎన్డీఏ కూటమి చేజిక్కించుకుంటుందని అంచనా ఏసింది.

హర్యానా:

ఇక హర్యానాలో ఓట్ల షేరింగ్ విషయానికొస్తే... ఇక్కడ ఎన్డీఏ కూటమి 50%, ఇండియా కూటమి 38%, ఇతరులు 12% సాధించుకునే అవకాశం ఉందని అంచనా వేయగా... ఇక సీట్ల విషయానికొస్తే... ఎన్డీఏ కూటమికి 8 స్థానాలు, ఇండియా కూటమికి 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

హిమాచల్ ప్రదేశ్:

హిమాచల్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలపై ఇండియా టుడే అంచనాలు వార్ వన్ సైడ్ అనే చెబుతున్నాయి. ఇందులో భాగంగా... ఇక్కడ ఎన్డీఏ కూటమికి 60% ఓట్ల షేర్ తో ఉన్న 4 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. 29% ఓట్ల షేర్ తో ఇండియా కూటమి, 11% ఓట్ల షేర్ తో ఇతరులు సున్నా స్థానాలు గెలుచుకుంటారని తెలిపింది.

జమ్మూ & కశ్మీర్:

ఇక జమ్మూ & కశ్మీర్ విషయానికొస్తే ఎన్డీఏ కూటమికి 49%, ఇండియా కూటమికి 36%, ఇతరులకు 15% ఓట్ల షేర్ వస్తాయని.. ఇక లోక్ సభ స్థానాల విషయానికొస్తే ఎన్డీఏ కూటమికి 2, ఇండియా కూటమికి 3 స్థానాలు వస్తాయని అంచనా వేశింది.

పంజాబ్:

పంజాబ్ లో ఇండియా కూటమి 65% ఓట్లు, ఎన్డీఏ కూటమి 17% ఓట్లు, ఇతరులు 18% ఓట్లు సంపాదించుకునే అవకాశం ఉందని అంచనా వేసిన ఇండియా టుడే... సీట్ల విషయానికొచ్చే సరికి ఇండియా కూటమి (ఆప్ 5 – కాంగ్రెస్ 5) 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండగా.. ఎన్డీఏ కూటమికి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

ఉత్తరాఖండ్:

ఉత్తరాఖండ్ విషయానికొస్తే... ఎన్డీఏ కూటమి 59 ఓట్ల శాతంతో ఉన్న 5 సీట్లను సాధించుకునే అవకాశం ఉందని... ఇక మిగిలిన ఓట్లలో ఇండియా కూటమి 32% ఓట్లు, ఇతరులు 9% ఓట్లతో సున్నా స్థానాల్లో గెలుచుకుంటారని అంచనా వేసింది.

మహారాష్ట్ర:

ఇదే సమయంలో మహారాష్ట్ర విషయానికొస్తే... ఎన్డీఏ కూటమికి 40%, ఇండియా కూటమికి 45%, ఇతరులకు 15% ఓట్ల షేర్ వచ్చే అవాకాశం ఉందని వెల్లడించింది. ఇక సీట్ల విషయానికొస్తే... ఎన్డీఏ కూటమి 22 సీట్లు, ఇండియా కూటమి 26 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్:

దక్షిణాదిలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఇక్కడ టీడీపీకి 45%, బీజేపీకి 2%, కాంగ్రెస్ కు 3%, ఇతరులకు 9%, అధికార వైసీపీకి 41% సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన ఇండియా టుడే... సీట్ల విషయానికొస్తే 17 టీడీపీకి, 8 వైసీపీకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

తెలంగాణ:

ఇదే క్రమంలో తెలంగాణ విషయానికొస్తే... తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే అంచనా వేయగా... మిగిలిన స్థానాల్లో 3 బీఅరెస్స్, 3 బీజేపీ, 1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

కేరళ:

కేరళ విషయానికొస్తే... ఇక్కడ ఇండియా కూటమి క్లీన్ స్వీప్ అని అంచనా వేసింది ఇండియా టుడే. ఇందులో భాగంగా... ఇక్కడ 78% ఓట్ల తో ఇండియా కూటమి ఉన్న 20స్థానాలనూ గెల్చుకుంటుందని.. ఇక 17% ఓట్లతో ఎన్డీయే కూటమి సున్నా స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది.

కర్ణాటక:

కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఎన్డీయే కూటమే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుతుందని అంచనా వేసింది. ఇందులో భాగంగా... 53% ఓట్లతో ఎన్డీఏ కూటమి 24 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉండగా... 42% ఓట్లతో ఇండియా కూటమి 4 స్థానల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.

తమిళనాడు:

ఇక తమిళనాడులో ఇండియా కూటమి 39కి 39 స్థానాల్లోనూ గెలుపొందే అవకాశం ఉందని ఇండియా టుడే అంచనా వేసింది. ఇక్కడ ఎన్డీఏ కూటమికి 15% ఓట్లతో సున్నా స్థానాలు వస్తాయని తెలిపింది. .