Begin typing your search above and press return to search.

యూకే హెల్త్ సెక్టార్ లో మనోళ్లే టాప్!

అవును... బ్రిటన్ ఆరోగ్య రంగంలో భారతీయులదే హవా అని తెలిపే సంచలన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   10 Aug 2023 11:30 PM GMT
యూకే హెల్త్  సెక్టార్  లో మనోళ్లే టాప్!
X

యూకే, యూ.ఎస్.ఏ, ఆస్ట్రేలియా వంటి అగ్ర రాజ్యాల్లోని చాలా రంగాల్లో భారతీయులే కీలక భూమిక పోషిస్తుంటారని అంటుంటారు. ఐటీ రంగంలోనే కానీ, ఫ్యాకల్టీ రంగంలోనే కానీ... మొదలైన రంగాల్లో భారతీయులు కీ రోల్ పోషిస్తుంటారని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆరోగ్య రంగంలో కూడా భారతీయులదే హవా అని తేలింది!

అవును... బ్రిటన్ ఆరోగ్య రంగంలో భారతీయులదే హవా అని తెలిపే సంచలన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... గతేడాది బ్రిటన్‌ లో స్కిల్డ్ వర్క్ వీసాల కింద స్పాన్సర్ చేయబడ్డ మెజారిటీ హెల్త్ కేర్ వర్కర్లకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. వీరిలో యూరోపియన్ యూనియనేతర దేశాల నుంచి వచ్చినవారి వివరాలు తెలిపింది.

వీరిలో ఎక్కువమంది భారత్ నుంచి వస్తే.. కేవలం ఒకే ఒక్క శాతం మాత్రమే ఈయూ దేశాలకు చెందిన వారని రిపోర్ట్ పేర్కొంది. తాజాగా ఆక్స్‌ ఫర్డ్‌ లోని మైగ్రేషన్ అబ్జర్వేటరీ తెలిపిన వివరాల ప్రకారం... యూకే ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ 2022-23 ఆర్ధిక సంవత్సరంలో విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను హెల్త్ అండ్ కేర్ వర్క్ ఫోర్స్‌ లోకి తీసుకొచ్చింది.

ఇదే సమయంలో కొత్తగా రిక్రూట్ అయిన విదేశీ వైద్యులు (20 శాతం), నర్సులు (46 శాతం) తో జాతీయతపరంగా భారత్ అగ్రస్థానంలో ఉందని నివేదిక తెలియజేసింది. భారత్ తర్వాత... నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.

ఇదే సమయంలో 2022లో సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌ షిప్ ని ఉపయోగించే కార్మికులకు పౌరసత్వం విషయంలోనూ భారతదేశం (33 శాతం) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జింబాబ్వే, నైజీరియా ఉన్నాయి.

ఇక తాజాగా యూకే ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ మార్చి 2023తో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో భారీ సంఖ్యలో విదేశీ హెల్త్, హెల్త్ అండ్ కేర్ కార్మికులను నియమించుకుంది. దాదాపు 57,700 మంది హెల్త్ కేర్ వర్కర్లు స్కిల్డ్ వర్క్ వీసాలు పొందారు.