అమెరికాలో భారతీయుల జనాభా ఇది...సెకండ్ ప్లేస్ అంట!
ఇదే సమయంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. అది దాదాపు 47 లక్షల మంది అని తేలింది
By: Tupaki Desk | 22 Sep 2023 3:51 AM GMTభారత్ సుమారు 142.8 కోట్ల జనాభాతో చైనాను దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారనుందని ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన గణాంకాలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఇది ఇది యూరప్ జనాభా (74.4 కోట్లు), అమెరికా జనాభా (104 కోట్లు) కంటే చాలా ఎక్కువ. ఇక 142.57 కోట్ల జనాభాతో చైనా రెండవ స్థానంలో నిలుస్తుంది.
ఇదే సమయంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. అది దాదాపు 47 లక్షల మంది అని తేలింది. ఈ మేరకు 2020 నాటి జాతులవారీ సమగ్ర జనాభా లెక్కల వివరాలను తాజాగా విడుదల చేశారు. ప్రతీ పదేళ్లకు ఒకసారి రూపొందించే లెక్కల్ని ఈసారి మూడేళ్లు ఆలస్యంగా వెల్లడించారు.
తాజా నివేధిక ప్రకారం అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో చైనీయులు ఎక్కువ. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంలో చైనా రెండో స్థానంలో ఉండగా.. అమెరికాలో ఉన్న విదేశీయుల్లో మాత్రం చైనా.. భారత్ ను వెనక్కి నెట్టి మొదటి ప్లేస్ లో ఉంది. ఇందులో భాగంగా... అమెరికాలో నివసిస్తున్న చైనీయుల సంఖ్య 52 లక్షల మంది అని చెబుతున్నారు.
ఇలా అగ్రరాజ్యంలో నివసిస్తున్న వలసదారుల్లో చైనా, భారత్ తర్వాత ఫిలిప్పీన్స్ దేశస్తులు 44 లక్షల మంది ఉన్నారని చెబుతున్నారు. అనంతరం ఉత్తర ఆఫ్రికా, వెనెజువెలాకు చెందినవారు వేగంగా పెరుగుతున్నారనీ.. వీరి జనాభా 35 లక్షలు ఉందని తేలింది. ఇదే క్రమంలో వియత్నాం ప్రజలు 22 లక్షలమంది అగ్రరాజ్యంలో ఉన్నారు.