Begin typing your search above and press return to search.

మాటతప్పిన యాపిల్... ఆ దేశంలో ఐఫోన్16 పై నిషేధం!

కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు ఇతర దేశాలకు చెందిన కార్పొరేట్ కంపెనీల విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంటాయి.

By:  Tupaki Desk   |   26 Oct 2024 3:49 AM GMT
మాటతప్పిన యాపిల్... ఆ దేశంలో ఐఫోన్16 పై నిషేధం!
X

కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు ఇతర దేశాలకు చెందిన కార్పొరేట్ కంపెనీల విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంటాయి. మరికొన్ని దేశాల ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలు చెప్పినట్లు ఆడుతుంటాయని అంటుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే కారణంతో ఐఫోన్ 16పై నిషేధం విధించింది ఇండోనేషియా ప్రభుత్వం.

అవును... యాపిల్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఐఫోన్ 16పై ఇండోనేషియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉందంటే... తమ దేశంలో ఈ ఫోన్ విక్రయాలపై అంక్షలు పెట్టడంతోపాటు .. విదేశాల్లో కొని ఆ దేశంలో వాడటంపైనా నిషేధం విధించింది. దీంతో... ఇండోనేషియాకు వెళ్దామని భావిస్తున్న టూరిస్టులు తలలు పట్టుకుంటున్నారని అంటున్నారు.

అసలు ఏమి జరిగిందంటే.... ఇండోనేషియాలో పెట్టుబడులు పెట్టే విషయంలో యాపిల్.. అక్కడి ప్రభుత్వానికి మాట ఇచ్చిందంట. ఇందులో భాగంగా.. 1.71 మిలియన్ ఇండోనేషియా రూపాయలను పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చిందంట. అయితే... కేవలం 1.48 మిలియన్ ఇండోనేషియా రూపాయిలను మాత్రమే పెట్టుబడి పెట్టిందంట.

ఈ మేరకు అక్కడ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇలా మాట తప్పిన యాపిల్, తన బాధ్యతను మరిచిపోవడంతో ఇండోనేషియా ప్రభుత్వం ఈ మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇదే సమయంలో... ఇండోనేషియాలో యాపిల్ ప్రొడక్ట్స్ విక్రయించాలంటే.. సుమారు 40 శాతం స్థానికంగానే తయారు చేయాలనే నిబంధన కూడా ఉందంట.

ఈ విషయంలోనూ యాపిల్ సంస్థ ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఇండోనేషియా ఇండస్ట్రీస్ మినిస్టర్ గుమివాంగ్... తమ దేశంలో ఆ ఫోన్ వాడటనికి ఐ.ఎం.ఈ.ఐ. సర్టిఫికేషన్ లేదని.. ఒక వేళ ఎవరైనా వాడితే అది అక్రమమే అవుతుందని.. ఈ విషయంలో ప్రజలు తమకు సహకరిస్తూ, సమాచారం ఇవ్వాలని కోరారు.

దీంతో... ఆ దేశానికి టూర్ ప్లాన్ చేసుకున్న ఐఫోన్ 16 కలిగి ఉన్న వారు ఇండోనేషియా తాజా నిర్ణయంతో షాక్ కి గురయ్యారని అంటున్నారు. ఏది ఏమైనా... మాట తప్పిందనే కారణంతో కార్పొరేట్ కంపెనీల విషయంలో ఆ ప్రభుత్వం ఇంత స్ట్రిక్ట్ గా ఉండటాన్ని పలువురు అభినందిస్తున్నారు కూడా!