Begin typing your search above and press return to search.

టెంపరరీ పెళ్లిళ్ల సర్వీస్.. ఇండోనేషియా సరికొత్త బిజినెస్..

ఇండోనేషియాలో సరికొత్త బిజినెస్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   4 Oct 2024 9:30 PM GMT
టెంపరరీ పెళ్లిళ్ల సర్వీస్.. ఇండోనేషియా సరికొత్త బిజినెస్..
X

ఇండోనేషియాలో సరికొత్త బిజినెస్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఈ బిజినెస్ ను నెటిజెన్లందరూ విమర్శించడమే కాకుండా ఈ పద్ధతి సరికాదు అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టూరిస్టులను ఆకట్టుకోవడానికి ఈ దేశంలో ప్రతి వివాహం పేరుతో మొదలైన ఈ బిజినెస్ పలువురని కలవరపరుస్తోంది. అయితే లాభసాటిగా ఉండడంతో ఈ బిజినెస్ చేస్తున్న ఏజెన్సీల సంఖ్య ఇండోనేషియాలో భారీగా పెరుగుతుంది.

ఈ ఏజెన్సీ బారిన పడి పేద కుటుంబాలకు చెందిన యువతులు ఎందరో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వారి పరిస్థితులను ఏజెంట్లు తమకు అనుకూలంగా మార్చుకొని బాగానే డబ్బు సంపాదిస్తున్నారు. ఈ వ్యాపారం గురించి ప్రముఖ వార్తా సంస్థ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన కథనం పలువురిని కలవరపరుస్తోంది.

ఇండోనేషియా దేశంలో టూరిజం బిజినెస్ కథ కొన్ని సంవత్సరాలుగా బాగా పెరిగింది. టూరిస్ట్లను ఆకట్టుకోవడానికి కొత్త సర్వీసులు ప్రారంభించిన ఏజెన్సీలు.. టెంపరరీ పెళ్లిళ్లు అనే వ్యాపారాన్ని షురూ చేశారు. ఇండోనేషియా ముస్లిం దేశం కావడంతో అక్కడ మగవారి ఆ అవకాశాలకు వేరుగా అనుమతులు దొరకవు. వాటిని తీర్చడం కోసం పెళ్లి అనే సాకుతో మతం నియమాలను వక్రీకరిస్తూ ఓ టెంపరరీ వివాహ వ్యవస్థను ఈ ఏజెంట్లు సృష్టించారు.

అయితే ఈ ప్రత్యేకమైన సర్వీస్ పశ్చిమ ఇండోనేషియాలోని పున్‌కాక్ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తుంది. అక్కడికి వచ్చే టూరిస్టుల దగ్గర డబ్బులు తీసుకొని వారికి అవసరమైనన్ని రోజులు అంటే ఓ వారం లేక నెల రోజుల వరకు భార్యగా సర్విస్ అందించే అందమైన భామలను ఏజెంట్లు సప్లై చేస్తారు. అంటే కావలసినవారు అక్కడికి వెళ్లి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు.. భార్యాభర్తల్లాగా మెలగవచ్చు.. టూరు పూర్తిచేసుకుని వెళ్లేటప్పుడు ఆ యువతీకి విడాకులు ఇచ్చేయవచ్చు.

అయితే ఈ బిజినెస్ కు ఎక్కువగా కష్టమర్లు అరబ్ దేశం నుంచి వస్తున్నారు. ఈ సర్వీస్ పెట్టిన తర్వాత ఇండోనేషియా కి వచ్చే టూరిస్ట్ ల సంఖ్య కూడా బాగా పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతున్న ఇలాంటి వివాహాలకు ఎటువంటి చట్టబద్ధత లేదు. ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.