భర్తకు భరణం చెల్లించమన్న కోర్టు.. ఎందుకంటే?
ఈ ఉదంతంలో కోర్టు భిన్నమైన తీర్పును ఇచ్చి తప్పుడు ఆరోపణలు చేసే భార్యలకు బలమైన హెచ్చరిక ఇచ్చేలా తీర్పును ఇచ్చారు.
By: Tupaki Desk | 23 Feb 2024 8:30 AM GMTరోటీన్ కు భిన్నమైన తీర్పును ఇచ్చింది ఇండోర్ కోర్టు. భర్తల మీద తప్పుడు కేసులు పెట్టి భరణం కోసం డిమాండ్ చేసే భార్యలకు షాకిచ్చే తీర్పును ఇచ్చింది న్యాయస్థానం. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. మహిళలకు చట్టం ఇచ్చే రక్షను తప్పుడు మార్గాల్లో వాడే వారికి షాకిచ్చేలా కోర్టు ఆదేశాలు ఉన్నాయి. వరకట్నం వేధింపుల పేరుతోకేసు పెట్టి.. విడాకులు కోరిన మహిళ.. భర్త నుంచి భరణం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ ఉదంతంలో కోర్టు భిన్నమైన తీర్పును ఇచ్చి తప్పుడు ఆరోపణలు చేసే భార్యలకు బలమైన హెచ్చరిక ఇచ్చేలా తీర్పును ఇచ్చారు.
ఉజ్జయినికి చెందిన అమన్ 2020లో ఒక యువతిని కలిశారు. తర్వాత వారిద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటికి అతను ప్లస్ టూ చదువుతున్నాడు. అయితే.. సదరు యువతి తనను పెళ్లిచేసుకోవాలని లేదంటే తాను సూసైడ్ చేసుకోవాలని బెదిరింపులకు దిగటంతో ఆమెను 2021లో పెళ్లాడాడు.అయితే.. ఆమె పెడుతున్న హింసను తట్టుకోలేని ఆ యువకుడు ఆమెను వదిలేసి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు.
దీంతో తన భర్త కనిపించటం లేదని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. అనంతరం వరకట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నట్లుగా పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు భరణం ఇప్పించాలని కోరింది.
తొలుత చేసిన కంప్లైంట్ కు తర్వాత ఆమె కోర్టులో చేసిన వాదనకు పొంతన లేకపోవటం.. ఇరు వర్గాల వాదనల్ని విన్న న్యాయమూర్తి సంచలన తీర్పును ఇచ్చారు. తప్పుడు పద్దతులతో భర్తను బెదిరింపులకు దిగుతున్న సదరు మహిళే.. భర్తకు నెలకు రూ.5వేలు చొప్పున భరణం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ తీర్పు ఇప్పుడు వైరల్ గా మారింది.