వాట్సప్.. ఇన్ స్టా లకు జలుబు చేసింది.. ప్రపంచానికి తుమ్ములు
సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొన్ని సౌకర్యాలు కాలక్రమంలో మనిషి జీవితాన్ని శాసించే స్థాయికి వెళ్లిపోయిన పరిస్థితి. అందుకు ఉదాహరణ వాట్సప్. ఇవాల్టి రోజున వాట్సప్ లేకుండా జీవితాన్ని ఊహించుకుంటే అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. అం
By: Tupaki Desk | 12 Dec 2024 4:26 AM GMTసాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొన్ని సౌకర్యాలు కాలక్రమంలో మనిషి జీవితాన్ని శాసించే స్థాయికి వెళ్లిపోయిన పరిస్థితి. అందుకు ఉదాహరణ వాట్సప్. ఇవాల్టి రోజున వాట్సప్ లేకుండా జీవితాన్ని ఊహించుకుంటే అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. అంతలా జీవితాన్ని ప్రభావితం చేసే సౌకర్యానికి సుస్తీ ఏర్పడితే ఎలా ఉంటుంది? తాజాగా అలాంటి అనుభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు అనుభవించారు.
బుధవారం రాత్రి ప్రపంచంలోని పలు దేశాల్లో వాట్సప్.. ఇన్ స్టాలు సరిగా పని చేయలేదు. దీంతో.. లక్షలాది యూజర్లకు చుక్కలు కనిపించిన పరిస్థితి. బుధవారం రాత్రి పలువురు యూజర్లు పోస్టు చేసిన పోస్టులు వెళ్లటం లేదని. లాగిన్ చేయలేకపోతున్న విషయాన్ని డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ వెల్లడించింది. సేవల్లో ఇబ్బందులు ఎదురు కావటంతో పలువురు ఎక్స్ వేదికగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పేర్కొన్నారు.
అంతేకాదు వాట్సప్.. ఇన్ స్టా సేవలు తాత్కాలికంగా నిలిచిపోవటంతో. ఈ తీరును ప్రతిబింబించేలా మీమ్స్ ను పోస్టు చేస్తున్నారు. దీనిపై మెటా స్పందించింది. టెక్నికల్ సమస్యలతో తమ యాప్స్ ను పలువురు ఉపయోగించుకోలేకపోతున్న విషయంపై ఫిర్యాదులు తమకు అందాయని. సాధ్యమైనంత త్వరగా సేవల్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. సేవల్లో అంతరాయానికి తాము క్షమాపణలు కోరుతున్నట్లుగా మెటా పేర్కొంది. ఈ మొత్తం ఎపిసోడ్ చేస్తే.. వాట్సప్.. ఇన్ స్టా లకు జలుబు చేస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాని యూజర్లలోని పలువురికి తుమ్ములు వచ్చినట్లుగా మారిందన్న వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు.