శతకోటి గుడ్లలో ఇది ఒక గుడ్డు... ఇన్ స్టాలో 4.9 మిలియన్ ఫాలోవర్స్!
అవును... తాజాగా ఓ కోడిగుడ్డు ఇన్ స్టాగ్రాంలో సెన్సేషన్ గా మారింది. ప్రస్తుతం ఆ గుడ్డుకు ఉన్న ఫాలోవర్స్ ని చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
By: Tupaki Desk | 27 Oct 2023 12:30 AM GMTసాధారణంగా సినిమా నటులకు, క్రీడాకారులకు, మరికొంత మంది వ్యాపారులకు, రాజకీయ నాయకులకు ఆన్ లైన్ లో అభిమానులు ఉంటారనేది తెలిసిన విషయమే. ఆన్ లైన్ లో వాళ్ల ఫాలోయింగ్ కూడా ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారిన పరిస్థితి. ఇదే సమయంలో ఈ సోషల్ మీడియా కాలంలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పడం కూడా కష్టం. ఈ సమయంలో ఒక గుడ్డు ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనికి ఫాలోవర్స్ లక్షల సంఖ్యలో ఉండటం గమనార్హం.
అవును... తాజాగా ఓ కోడిగుడ్డు ఇన్ స్టాగ్రాంలో సెన్సేషన్ గా మారింది. ప్రస్తుతం ఆ గుడ్డుకు ఉన్న ఫాలోవర్స్ ని చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! కారణం.. ఆ గుడ్డుకి ఉన్న ఫాలోవర్స్ వంద, వెయ్యి కాదు.. ఏకంగా లక్షల్లో ఉన్నారు. అవును.. ఆ కోడిగుడ్డుకు 49 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నమ్మడానికి కాస్త అనుమానంగా అనిపించినా ఇది అక్షరాలా నిజం!
ఆ స్థాయిలో ఈ కోడిగుడ్డుకు ఏదో ప్రత్యేకతే ఉండి ఉంటుంది.. ఇది అత్యంత పాత కోడి గుడ్డా.. పురాతన తవ్వకాళ్లో దొరికిన గుడ్డా.. లేక ఈ సృష్టిలో మొదటి గుడ్డా.. అనే చరిత్ర ఏమీ లేదు. జస్ట్ శతకోటి గుడ్లలో ఇది ఒక గుడ్డు అంతె! ఈ ఇన్ స్టా ప్రొఫైల్ లో ఆ ఒక్క గుడ్డు ఫొటో తప్ప ఏ ఫొటో కనిపించదు.
దీన్ని "ది ఎగ్ గ్యాంగ్" అనే పేరుతో ఈ అకౌంట్ లో హ్యాండిల్ చేస్తున్నారు. ఈ ఫొటో ఇన్ స్టాగ్రాం జనవరి 4 - 2019 లో పోస్ట్ చేశారు. అయితే... నాటి నుంచీ ఎవరో ఒకరు ఈ ఫొటోకు లైక్ కొడుతూ, కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఫలితంగా... ఆన్ లైన్ వేదికగా ఈ కోడిగుడ్డును స్పెషల్ గానే ఉంచుతున్నారు.
అలా అని కేవలం ఫాలోవర్స్ విషయంలోనే ఈ గుడ్డు ప్రత్యేకత సాధించిందనుకుంటే పొరపాటే... లైక్స్ లో విషయంలో కూడా ఈ గుడ్డు కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అందులో భాగంగా... ఇప్పటి వరకే ఈ కోడిగుడ్డుకు 6,02,26,034 లైక్స్ వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి!
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 2022లో ఫిపా మ్యాచ్ గెలిచిన అనంతరం లియోనెల్ మెస్సీ కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అప్పట్లో ఆయన పోస్ట్ చేసిన ఫొటోల తర్వాత ఎక్కువ లైక్స్ వచ్చిన ఫొటోగా ఈ కోడిగుడ్డు ఫొటో నిలిచింది. ఇలా ఈ గుడ్డు ఫోటో ఎన్ని రికార్డులు సృష్టించినప్పటికీ... అది ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటికే పెద్ద ప్రశ్నే!