Begin typing your search above and press return to search.

రోడ్డుపై వెర్రి చేష్టలు... సజ్జనార్ సీరియస్!

అవును... రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ లో రెడ్ లైట్ పడగానే.. రోడ్డు మధ్యలోకి వచ్చి డ్యాన్స్ చేసింది ఒక యువతి. రోడ్డుపై పడుకుని మరీ డ్యాన్స్ చేసింది

By:  Tupaki Desk   |   25 Dec 2023 5:25 AM GMT
రోడ్డుపై వెర్రి చేష్టలు... సజ్జనార్ సీరియస్!
X

ఇటీవల కాలంలో యూట్యూబ్ షార్ట్స్ కోసం కొంతమంది జనం.. ప్రధానంగా కొంతమంది యువత చేస్తున్న పనులు చిత్రవిచిత్రంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని సిల్లీ గా ఉంటే.. మరికొన్ని అసభ్యకరంగా ఉంటుంటాయి.. ఇంకొన్ని డేంజర్ గా కూడా అనిపిస్తుంటాయి. ఈ సమయంలో తాజాగా నడిరోడ్డుపై అలాంటిపనికి పూనుకున్న ఒక యువతిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.

అవును... రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ లో రెడ్ లైట్ పడగానే.. రోడ్డు మధ్యలోకి వచ్చి డ్యాన్స్ చేసింది ఒక యువతి. రోడ్డుపై పడుకుని మరీ డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఆన్ లైన్ వేదికగా ఆమె తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. బాధ్యత లేకుండా నడుచుకుంటున్నారంటూ ఫైరయ్యారు.

వివరాళ్లోకి వెళ్తే... ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్లు పడగానే.. వాహనాలు ఆగిపోతున్నాయి! ఈ సమయంలో బ్యాగ్ వేసుకుని ఓ యువతి రోడ్డు మధ్యలోకి వచ్చి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా... బ్యాగ్ ను పక్కకు విసిరేసి రోడ్డుపై పడుకుని డ్యాన్స్ చే యడం మొదలుపెట్టింది. ఇలా నడిరోడ్డుపై యువతి చేసిన ఈ విచిత్రమైన ప్రవర్తనతో వాహనదారులు షాకయ్యారు.

అలా నడిరోడ్డుపై ఆ యువతి డ్యాన్స్ చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఆమె స్నేహితులు వీడియో తీశారు. దీంతో... యూట్యూబ్ షార్ట్స్ కోసం ఇలా నడిరోడ్డుపై డ్యాన్స్ చేసినట్లు గ్రహించిన వాహనదారులు ఆమె తీరుపై మండిపడ్డారు. ఇదే సమయంలో... ఈ వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన సజ్జనార్.. యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందులో భాగంగా... నేటి యువతకు ఇన్‌ స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరమని సజ్జనార్ అన్నారు. ఇదే సమయంలో... సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం... సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనందమో.. ఏమో!?" అని ఫైరయ్యారు సజ్జనార్.