Begin typing your search above and press return to search.

గుజరాత్ లో ప్రధాని మోడీ టూర్ లో రేర్ సీన్

ఈ కార్యక్రమంలో మాట్లాడిన మోడీ నోట ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. తాను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   9 March 2025 10:06 AM IST
గుజరాత్ లో ప్రధాని మోడీ టూర్ లో రేర్ సీన్
X

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు దేశ ప్రజలు. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆయన తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్ లోని నవసారీ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రోటీన్ కు భిన్నమైన ఇస్పెషల్ సీన్ కనిపించింది.

సాధారణంగా ప్రధానమంత్రి లాంటి వీవీఐపీ పాల్గొనే కార్యక్రమంలో ఎంతటి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారో తెలియంది కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రికి రక్షణగా.. భద్రతా ఏర్పాట్లు మొత్తాన్ని మహిళలే నిర్వహించటం ఆసక్తికరంగా మారింది. ప్రోగ్రాం మొత్తం భద్రతను మహిళలే పర్యవేక్షించటం.. ప్రధానికి రక్షణగా 2500 మంది మహిళా పోలీసులు.. అధికారులు చూసుకున్నారు.

ఇక.. పురుష పోలీసులంతా పార్కింగ్ పర్యవేక్షణ.. ట్రాఫిక్ విధులకు పరిమితం కాగా.. ఆయనకు సెక్యురిటీ మొత్తం మహిళల్ని నియమించటం.. అందుకుతగ్గట్లే వారు సమర్థంగా విధుల్ని నిర్వహించటం అందరిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మోడీ నోట ఆసక్తికరవ్యాఖ్యలు వచ్చాయి. తాను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేర్కొన్నారు. తాను సంపన్నుడిని అన్నంతనే కొందరికి ఒళ్లు గగుర్పాటుకు గురవుతారని.. తాను ధనవంతుడ్ని అంటున్నది డబ్బు పరంగా కాదని.. తన ఖాతాలో కోట్లాది మంది మహిళల ఆశీర్వాదాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

కూతుళ్లు ఇంటికి ఆలస్యంగా వస్తే సవాలక్ష ప్రశ్నలు వేసే తల్లిదండ్రులు.. తమ కొడుకులు ఆలస్యంగా వచ్చినా కూడా ప్రశ్నించాలని చెప్పారు. అప్పుడే మెరుగైన సమాజం రూపొందుతుందన్న ఆయన.. భారత ఆత్మ గ్రామాల్లో ఉందని జాతిపిత గాంధీ అనేవారని.. ఆ గ్రామాలకు ఆత్మ మహిళలన్నది తన భావనగా చెప్పుకొచ్చారు.