Begin typing your search above and press return to search.

మోడీ స‌ర్‌.. ఇది ప‌క్కా ఇన్‌స‌ల్ట్‌.. రియాక్ట్ అవ్వండి!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌రిస్థితులు ఏమీ ఆశించిన‌ట్టుగా అయితే లేవు.

By:  Tupaki Desk   |   25 July 2024 6:00 AM GMT
మోడీ స‌ర్‌.. ఇది ప‌క్కా ఇన్‌స‌ల్ట్‌.. రియాక్ట్ అవ్వండి!
X

అగ్ర‌రాజ్యంలో ఏం జ‌రిగినా మేం తొడుంటాం.. అని ప్ర‌క‌ట‌న చేసే భార‌త్ విష‌యంలో అదే అమెరికా చాలా అవ‌మాన‌క‌ర రీతిలో వ్య‌వ‌హ‌రించింది. త‌మ దేశం నుంచి భార‌త్‌లో పర్య‌టించే వారిని ఉద్దేశించి.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌లో భార‌త్‌లోని కొన్ని రాష్ట్రాల‌ను పేర్కొంటూ.. ఆయా రాష్ట్రాలు చాలా డేంజ‌ర్ అని.. అక్క‌డ రాజ‌కీయ ఘ‌ర్ష‌ణ‌లు, గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని.. వాటి జోలికి వెళ్ల‌ద్ద‌ని.. అక్క‌డ వారిలో వారికే ర‌క్ష‌ణ లేద‌ని కూడా పేర్కొంది.

ఈ ప‌రిణామాన్ని.. అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌రిస్థితులు ఏమీ ఆశించిన‌ట్టుగా అయితే లేవు. అంతెందుకు.. త‌మ పౌరుల‌కు ఇన్ని జాగ్ర‌త్త‌లు చెబుతున్న‌.. అమెరికాలో శాంతి యుత వాతావ‌ర‌ణం ఉందా? అనేది ప్ర‌శ్న‌. ఎటు నుంచి ఎవ‌రు తుపాకీ తీసుకుని వ‌స్తారో.. ఎటు నుంచి ఎవ‌రు కాల్పులు జ‌రుపుతారో.. చెప్ప‌లేని దౌర్భాగ్య ప‌రిస్థితి నెల‌కొంది. అలాంటి అస్థిత‌ర‌త‌ను ఎదుర్కొంటున్న అమెరికా.. భార‌త్ విష‌యంలో ఇన్ని జాగ్ర‌త్త‌లు హెచ్చ‌రిక‌లు చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

నిజానికి ఏదేశ‌మైనా.. త‌మ పౌరుల విష‌యంలో భ‌ద్ర‌త పాటించాల్సిందే. అలాగ‌ని.. ఇత‌ర దేశాల అంత ర్గ‌త వ్య‌వ‌హారాల‌ను బహిర్గ‌త ప‌రచి.. ప‌ర్యాట‌కాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించేలా వ్య‌వ‌హ‌రించ‌డం అంత‌ర్జాతీయ సూత్రాల‌కు విరుద్ధం. పైగా త‌మ మిత్ర‌దేశ‌మ‌ని చెప్పుకొనే భార‌త్‌కు సంబంధించి ఇలా అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌ను వెల్ల‌డించడం ద్వారా.. అమెరికా ల‌క్ష్మ‌ణ రేఖ‌ను ఉల్లంఘిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. దీనిపై త‌క్ష‌ణ‌మే మోడీ స్పందించాల్సి ఉంది. అమెరికాకు స‌రైన విధంగా స‌మాధానం చెప్పాల‌ని భార‌తీయ స‌మాజం కోరుకుంటోంది.

అమెరికా అస‌లు ఏమంది?

+ భార‌త దేశంలో పెరుగుతున్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

(ఇది అన్ని దేశాల్లోనూ ఉన్న‌దే)

+ భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉంది.

(ఈ ప‌రిణామం 75 ఏళ్లుగా అంద‌రికీ తెలిసిందే)

+ కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, అశాంతి నెలకొంది.

(ఇప్పుడు కొత్త‌గా చెప్పేది కాదు. కొన్నిద‌శాబ్దాలుగా ఉన్న‌దే)

+ ఉగ్రవాదం, హింసాత్మక ఘటనల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఘ‌ర్ష‌ణ‌లు రేగుతున్నాయి.

(ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఒక్క భార‌త్‌లోనే లేవు)

+ భార‌త్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు, ఇతర చోట్ల అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక నేరాలు జరిగాయి.

(భార‌త ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తోంది. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. భ‌ద్ర‌త పెంచింది)

+ ఉగ్రవాదులు పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని కాల్పుల‌కు తెగ‌బ‌డే అవ‌కాశం ఉంది.

(అమెరికాలో తుపాకీ సంస్కృతి లేదా)

+ ఈ నేప‌థ్యంలో అమెరికా పౌరుల‌ను జాగ్ర‌త్త‌గాఉండ‌మ‌ని అగ్ర‌రాజ్యం సూచించింది. ఇదేస‌మ‌యంలో కొన్నిరాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌వ‌ద్ద‌ని తెలిపింది.

ఇవీ.. ఆ రాష్ట్రాలు..

+ఈశాన్య రాష్ట్రాలైన మ‌ణిపూర్‌, మేఘాల‌య‌, అసోంల‌లో ప‌ర్య‌ట‌న చేయొద్దు అని హెచ్చ‌రించింది.

రీజ‌నేంటి?

+ కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న స‌మ‌స్య‌ను, భార‌త అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌ను కూడా ఇలా తెర‌మీదికి తీసుకురావ‌డం వెనుక అగ్ర‌రాజ్యానికి బ‌ల‌మైన కార‌ణం ఉంది. అదే.. భార‌త ప్ర‌ధాని తాను వ్య‌తిరేకిస్తున్న ర‌ష్యా అధ్య‌క్షుడితో చెట్టాప‌ట్టాలేసుకుని తిర‌గడం.

+ అమెరికా చెప్పినా.. భార‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం.