Begin typing your search above and press return to search.

చెన్నైలో అద్భుతం.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వీక్షణం

దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   11 May 2024 2:30 PM GMT
చెన్నైలో అద్భుతం.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వీక్షణం
X

ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. వందల కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కనువిందు చేస్తోంది. సుమారు 400 కిలోమీటర్ల దూరంలో మిలమిలా మెరుస్తూ అందరిని సంభ్రమాశ్చర్యంలో నింపుతోంది. దీని ఆకారాన్నిచూసి మురిసిపోతున్నారు. కెమెరాల్లో బంధిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

మే 8 నుంచి 23వ తేదీ వరకు అంతరిక్ష కేంద్రం భూమి నుంచి కనిపిస్తుంది. నాసా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కేంద్రం సూర్యుడి కాంతి దీని మీద ప్రతిబింబించడంతో ప్రజలకు కనిపించనుంది. పగటి పూట అంతలా కనిపించకపోయినా రాత్రి మాత్రం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కొన్ని వారాల పాటు ఇది పలు నగరాల్లో దర్శనమివ్వనుంది.

చెన్నైలో శుక్రవారం రాత్రి 7 గంటలకు కొన్ని నిమిషాల పాలు సందడి చేసింది. మే 14 వరకు స్పేస్ స్టేషన్ నుంచి చూడొచ్చంటున్నారు. ముంబయి, ఢిల్లీ, బెంగుళూరు ప్రాంతాల్లో ఇది కనిపించనుంది. ఆకాశంలో మెరిసే వస్తువుల్లో ఇది మూడో అతిపెద్దది. ఇది మానవ నివాసయోగ్యమైన ఉపగ్రహం. భూమికి 400 కిలోమీటర్ల దూరంలో దిగువ కక్ష్యలో పరిభ్రమించనుంది.

ఇది భూమిని ఒకసారి చుట్టి రావడానికి 93 నిమిషాల సమయం పడుతుంది. రోజుకు సుమారు 15 సార్లు భూమిని చుట్టి వస్తుంది. అమెరికా, జపాన్, రష్యా, ఐరోపా, కెనడా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తుంటాయి. చాలా మంది శాస్త్రవేత్తలు ఇందులో పరిశోధనలు చేస్తుంటారు. కొత్త ఆవిష్కరణలు కనుగొంటూ ఉంటారు.