Begin typing your search above and press return to search.

2050 నాటికి జపాన్ జనాభాపై ఆసక్తికర విషయాలు!

అవును... 2050 నాటికి జపాన్‌ లో ఒంటరిగా నివసిస్తున్న సీనియర్ సిటిజన్ల సంఖ్య భారీగా పెరగవచ్చని ప్రభుత్వ అనుబంధ పరిశోధనా సంస్థ తెలిపింది.

By:  Tupaki Desk   |   14 April 2024 12:30 AM GMT
2050 నాటికి జపాన్  జనాభాపై ఆసక్తికర విషయాలు!
X

భారత్ వంటి దేశంలో యువత సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్న సమయంలో... చైనా వంటి దేశాల్లో జననాల సంఖ్య మరీ తగ్గిపోతుందని అంటున్నారు. ఇదే సమయంలో తాజాగా జపాన్ లో రానున్న 25 - 26 సంవత్సరాల్లో వృద్ధుల సంఖ్య బారీగా పెరిగిపోబోతుందని ప్రభుత్వ అనుబంధ పరిశోధనా సంస్థ వెల్లడించింది. దీంతో ఈ విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... 2050 నాటికి జపాన్‌ లో ఒంటరిగా నివసిస్తున్న సీనియర్ సిటిజన్ల సంఖ్య భారీగా పెరగవచ్చని ప్రభుత్వ అనుబంధ పరిశోధనా సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా వారి సంఖ్య 47% ఉండొచ్చని వెల్లడిస్తున్నారు. దేశంలో ఈ స్థాయి జనాభా మార్పు దాని సామాజిక భద్రతా వ్యవస్థపై భారీ భారాన్ని చూపుతుందని అంటున్నారు. 2050లో ఒకే వ్యక్తి కుటుంబాల సంఖ్య 23.3 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది!

ఈ విషయాలపై స్పందించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్.. ఈ సంఖ్య 2020లో 38% కంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలో.. ఒకే వ్యక్తి కుటుంబాల్లో 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు 2050 నాటికి 46.5% ప్రాతినిధ్యం వహిస్తారని, ఇన్‌స్టిట్యూట్ అంచనాలు తెలిపాయి.

ఈ క్రమంలో... ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన వృద్ధాప్య సమాజాలలో ఒకటైన జపాన్, ఇటీవలి దశాబ్దాలలో వివాహాల సంఖ్యలో స్థిరమైన క్షీణతను చూసిందని చెబుతున్నారు. స్తబ్దమైన ఆర్థిక వ్యవస్థ యువ తరాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో... రిక్రూట్ హోల్డింగ్స్ సేకరించిన డేటా ప్రకారం జపాన్‌ లో వారి 20 ఏళ్లలోపు 46% మంది పురుషులు, 30% మంది మహిళలు ఎప్పుడూ డేటింగ్ చేయలేదట.

ఈ నేపథ్యంలో... 2050 నాటికి జపాన్ లో ఒంటరిగా నివసిస్తున్న సీనియర్ సిటిజన్స్ సంఖ్య 47శాతంగా ఉండొచ్చని అధ్యనాలు చెబుతున్నాయి!