లీప్ ఇయర్ గురించి ఈ ఇంట్రస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
ఈ రోజు పుట్టినవారు నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే పుట్టిన రోజు సెలబ్రేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది.
By: Tupaki Desk | 29 Feb 2024 4:10 AM GMTఈరోజుకి ఒక ప్రత్యేకత ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఫిబ్రవరి 29. ఈ తేదీ నాలుగేళ్లకు ఒక్కసారి వస్తుంటుంది. ఈ రోజు పుట్టినవారు నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే పుట్టిన రోజు సెలబ్రేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా ప్రత్యేకమే..! ఈ సమయంలో అసలు లీప్ డే అంటే ఏమిటి.. ఆ లీప్ డేని నాలుగేళ్లకు ఒకసారి కలపకపోతే ఏమవుతుంది.. నాలుగు పావు రోజులు ఒక రోజుగా ఎందుకు మారుతుంది మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం...!
లీప్ ఇయర్ అంటే ఏమిటి..?
సాధారణంగా భూమి తనచుట్టూ తాను తిరగడానికి 24 రోజులు పడితే... సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందనేది తెలిసిన విషయమే! అయితే ఎగ్జాట్ గా చూస్తే... భూమి సూర్యుడి చుట్టూఉ తిరిగిరావడానికి 365 రోజుల, 5 గంటల, 48 నిమిషాల, 46 సెకన్లు పడుతుంది. అంటే.. దాదాపుగా 6 గంటలు ఎగస్ట్రా అన్నమాట.
ఇలాంటి ఆరు గంటలు నాలుగు సార్లు (6 * 4 = 24) కలిస్తే ఒక రోజు ఎగస్ట్రా వస్తుంది. అందుకే నాలుగేళ్లకు ఒకసారి నాలుగు పావు రోజులు కలిసి ఒక పూర్తి రోజు ఎగస్ట్రాగా వస్తుంది. అందుకే నాలుగేళ్లకు ఒకసారి ఏడాదికి 366 రోజులు వస్తాయి. ఇలా నాలుగేళ్లకు ఒకసారి 366 రోజులుగా వచ్చే సంవత్సరాన్నే "లీప్ ఇయర్" అంటారు.
అంటే... నాలుగుతో విభజితమయ్యే ప్రతీ సంవత్సరం ఒక లీపు ఇయర్ అవుతుందన్నమాట. ఉదాహరణకు ఈ ఏడాది 2024, గత లీప్ ఏడాది 2020. ఇక ఆ తర్వాత లీప్ ఇయర్స్ ని చూసుకుంటే.. 2028, 2032, 2036. అయితే... 1900 లేదా 00 తో ముగిసే సంవత్సరాలకు లీపు రాదు!!
లీప్ ఇయర్ లెక్కలు అవసరమా?
భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులతో పాటు 5 గంటల, 48 నిమిషాలు ఎక్కువైనంత మాత్రాన్న అవి కూడా పరిగణలోకి తీసుకోవాలా అంటే... కచ్చితంగా అవుననే అంటారు శాస్త్రవేత్తలు. అలా ఎగస్ట్రా ఉన్న గంటలను పరిగణలోకి తీసుకుని నాలుగేళ్లకు ఒకసారి ఒక అదనపు రోజు లెక్కించని పక్షంలో కాలక్రమేణా సీజన్లలో తేడా వచ్చేస్తుందని అంటున్నారు.
ఇందులో భాగంగా... ప్రతీ ఏటా 5 గంటల 48 నిమిషాలనూ పరిగణలోకి తీసుకోని పక్షంలో... 700 ఏళ్ల తర్వాత వేసవి కాలం మే, జూన్ కాలానికి బదులుగా డిసెంబర్ లో ప్రారంభమవుతుందని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం తెలిపింది. అదే.. ప్రతీ ఏడాది ఈ అదనపు గంటలను కూడా పరిగణలోకి తీసుకుని.. నాలుగేళ్లకు ఒకసారి లీపు ఇయర్ ని కంటిన్యూ చేస్తే... సీజన్లలో తేడా రాకుండా ఉంటుంది!!
ఫిబ్రవరిలోనే లీప్ ఎందుకు వస్తుంది?
వాస్తవానికి ఈ లీపు సంవత్సరం ఆలోచన క్రీస్తు పూర్వం 45 నాటిది. ప్రాచీన రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్.. "జూలియన్ క్యాలెండర్" ను స్థాపించినప్పుడు ఒక ఏడాది 365 రోజులతో 12 నెలలుగా విభజించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆ క్యాలెండర్ బాగానే ఉన్నా... 16వ శతాబ్దపు మధ్యకాలం నాటికి ఈస్టర్ వంటి ముఖ్యమైన రోజులు.. సీజన్ లో సుమారు 10 రోజులు ముందుగానే వచ్చేస్తున్నాయి.
దీంతో... ఈ సమస్యను పరిష్కరించడానికి "గ్రెగోరియన్ క్యాలెండర్" ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచీ ఈ అదనపు గంటలు, వాటిని కౌంట్ చేస్తూ నాలుగేళ్లకొక సారి అదనపు రోజును పరిగణలోకి తీసుకుంటారు. ఇక ఆ అదనపు రోజు ఫిబ్రవరిలోనే ఉండటానికి కారణం... ఏడాదిలో ఉన్న నెలల్లోకల్లా ఈ నెలలోనే తక్కువ రోజులు ఉండటమే!!
లీప్ ఇయర్ క్యాపిటల్స్!:
ప్రపంచంలో రెండు లీప్ ఇయర్ రాజధానులు ఉన్నాయి. అందులో ఒకటి ఆంథోనీ టెక్సాస్ కాగా.. మరొకటి ఆంథోనీ న్యూ మెక్సికో. ప్రతీ లీప్ డే నాడు ఈ రెండు ప్రదేశాలలోనూ వేడుకలు పెద్దేత్తున జరుగుతాయి.
ఇక ఈ రోజున జన్మించిన శిశువులను లీప్లింగ్స్ లేదా లీప్ ఇయర్ బేబీస్ అని పిలుస్తారు. వీరికి నాలుగేళ్లకు ఒకసారి బర్త్ డే జరుపుకునే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది సహజంగా... ఫిబ్రవరి 28ని కానీ, మార్చి 1ని కానీ తమ తమ బర్త్ డేలు జరుపుకుంటూ ఉంటారు.