Begin typing your search above and press return to search.

ఐఫోన్‌ 15 అన్‌ బాక్స్‌ పై లేటెస్ట్ అప్ డేట్!

ఐఫోన్‌ 15 విడుదల గురించి ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ప్రొడక్ట్స్ ఫ్యాన్స్ చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Sep 2023 9:38 AM GMT
ఐఫోన్‌ 15 అన్‌ బాక్స్‌ పై లేటెస్ట్ అప్ డేట్!
X

ఐఫోన్‌ 15 విడుదల గురించి ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ప్రొడక్ట్స్ ఫ్యాన్స్ చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఐఫోన్ 15 అప్ డేట్స్ గురించి మరింత ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సమయంలో అలాంటి యాపిల్ అభిమానుల కోసం తాజాగా ఒక కీలక విషయం సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తుంది.

అవును... ఐఫోన్ 15 ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈమధ్యే ఈ విషయంపై కీలక అప్ డేట్ వచ్చింది. ప్రపంచంతో కలిసి దాదాపుగా ఒకేసారి భారత్ కూడా ఈ ఐఫోన్ ను అన్ బాక్స్ చేయబోతుందనే విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది.

వివరాళ్లోకి వెళ్తే... సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దాదాపు నెల తర్వాత ఐఫోన్‌ భారత్‌ కు వస్తుంటుందనేది తెలిసిన విషయమే. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... యావత్‌ ప్రపంచంతో పాటే భారత్‌ కూడా కొత్త ఐఫోన్‌ ను అన్‌ బాక్స్‌ చేయనుందని తెలుతుంది.

సెప్టెంబరు 12న ఐఫోన్ 15 ఫోను ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో... ఆ లాంఛ్ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే భారత్‌ లోనూ ఐ ఫోన్‌ అమ్మకానికి అందుబాటులో ఉండొచ్చని తెలుతుంది. ఇదే సమయంలో ఇప్పటికే చెన్నైలోని ఫాక్స్‌ కాన్‌ ప్లాంట్‌ లో ఐఫోన్‌ 15 తయారీ కోసం ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది.

కాగా ఐ ఫోన్ 14 చెన్నైలోని ప్లాంట్‌ లో తయారీ గ్లోబల్‌ లాంఛ్‌ తర్వాత పదిరోజులకు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అనంతరం ఆ ఫోన్ మార్కెట్‌ లోకి రావడానికి సుమారు 30 రోజులు పట్టింది. అయితే ఈసారి అంత టైం తీసుకోకుండా.. కొద్ది రోజుల్లోనే ఇండియాలో కూడా లాంఛ్ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో మరి ముఖ్యంగా... చెన్నైలో తయారు చేసిన ఫోన్లను మొదట ఇండియాలోనే విక్రయించాలని... ఆ తర్వాత ఎగుమతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. పైగా సెప్టెంబర్ తర్వాత ఇక పండగల సీజన్‌ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్‌ లో డిమాండ్‌ ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని సంస్థ భావిస్తోందని తెలుస్తుంది.

ఇదే సమయంలో క్రిస్మస్, న్యూ ఇయర్ సమయానికి అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతులు ప్రారంభించొచ్చని అంటున్నారు. అంటే.. ఈసారి ఇండియాలో తయారయ్యే ఐ ఫోన్ లు ముందుగా ఇండియాలోనే అమ్మకానికి ఉంచిన అనంతరం... విదేశాలకు ఎగుమతి కాబోతున్నాయన్నమాట! ఇది యాపిల్ ప్రొడక్ట్ అభిమానులకు గుడ్ న్యూసే!