ఐఫోన్ లో మూగబోయిన అలారం.. తెరపైకి 2015 నాటి సంగతులు!
కొన్ని ఐఫోన్ అలారాలు మోగడం లేదనే ఫిర్యాదులు తెరపైకి వచ్చాయి.
By: Tupaki Desk | 2 May 2024 12:30 PM GMTకొన్ని ఐఫోన్ అలారాలు మోగడం లేదనే ఫిర్యాదులు తెరపైకి వచ్చాయి. దీంతో ఈ సమస్యను నిర్ధారించిన యాపిల్ యాజమాన్యం... అందుకు కారణమైన సమస్యను పరిష్కరించడానికి త్వరగా పని చేస్తున్నట్లు చెబుతోంది. ఈ సమయంలో... చాలా మంది ఐఫోన్ వినియోగదారులు.. ఈ ఐఫోన్ లోని ఈ సమస్యతో సరికొత్త సమస్యలు వచ్చాయని ఆన్ లైన్ వేదికగా రియాక్ట్ అవుతున్నారని తెలుస్తుంది.
అవును... సాఫ్ట్ వేర్ లోపం వల్ల ఐఫోన్ లో అలారం మోగక యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సమస్య ఉన్నట్లు నిర్ధారించిన యాపిల్ సంస్థ పరిష్కారం దిశగా చర్యలు చేపట్టిందని బీబీసీ పేర్కొంది! అయితే ఈ సమస్య ఎందుకు వచ్చింది.. ఈ సమయంలో వినియోగదారులు ఏమి చేయాలి.. ఎప్పటిలోపు ఆ సమస్య పరిష్కరించబడుతుంది అనే విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు!
ఇదే సమయంలో... ఎంత మంది వ్యక్తులు ఈ సమస్యను ఎదుక్రొంటున్నారు.. ఈ సమస్య అన్ని ఐఫోన్ లకూ ఉందా.. లేక, నిర్దిష్ట మోడల్ లకు మాత్రమే పరిమితం చేయబడిందా అనేది కూడా అస్పష్టంగా ఉంది. ఈ సమయంలో... అలారాలు సెట్ చేస్తే అవి ఆఫ్ కాలేదని ఒక మహిళా ఫిర్యాదు చేయగా... ఈ సమస్య గురించి తమకు తెలిసిందని ఆపిల్ ధృవీకరించింది.
కాకపోతే... ఈ సమస్యను త్వరగా పరిష్కరించగలమని యాపిల్ భావిస్తోందని తెలుస్తుంది. అయితే ఎప్పటిలోగా ఈ సమస్యను పరిష్కరించగము అనే విషయంపై మాత్రం యాపిల్ క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది. కాగా... 2015లోనూ ఐఫోన్ లో అలారం సమస్యరాగా.. అప్పుడు దీనికి పరిష్కారంగా యాపిల్ ఒక అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.