Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు ఐపీఎస్ లకు షాకిస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు!

ఏళ్లకు ఏళ్లుగా వారు వినిపిస్తున్న వాదనల్ని పక్కన పెట్టేసిన కేంద్ర హోంశాఖ తాజాగా విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   22 Feb 2025 7:30 AM GMT
ఆ ముగ్గురు ఐపీఎస్ లకు షాకిస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు!
X

తెలంగాణలో పని చేస్తున్న ముగ్గురు ఐపీఎస్ లకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. ఏళ్లకు ఏళ్లుగా వారు వినిపిస్తున్న వాదనల్ని పక్కన పెట్టేసిన కేంద్ర హోంశాఖ తాజాగా విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. దాని సారాంశం ఏమంటే.. తక్షణమే ఏపీకి వెళ్లి రిపోర్టు చేయాలని. దీంతో సీనియర్ ఐపీఎస్ లకు ఏపీకి వెళ్లక తప్పనిపరి పరిస్థితి. దీంతో.. వారేం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

పేరుకే ఏపీ క్యాడర్.. విభజన నాటి నుంచి తెలంగాణలోనే కొనసాగుతున్నారు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు. వారు.. తెలంగాణ రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్ అంజనీ కుమార్ (1990), తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ (1994).. కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి (2011). ఈ ముగ్గురిలో ఒక్క అభిషేక్ మహంతి ఒక్కరే మిగిలిన ఇద్దరి కంటే జూనియర్ గా చెప్పాలి. అంజనీకుమార్ విషయానికి వస్తే ఆయన తెలంగాణ డీజీగా పని చేయటం తెలిసిందే.

2023 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే.. నాటి టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. పుష్పగుచ్చం ఇవ్వటం పెను కలకలంగా మారటం.. అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తెలంగాణ డీజీ పదవి నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి. ఈ ముగ్గురు ఏపీ క్యాడర్ కు చెందిన వారుగా కేంద్ర హోం శాఖ గుర్తించింది.

నిజానికి విభజన వేళ నుంచే.. వీరిని ఏపీకి కేటాయించారు. అయితే.. ఆ కేటాయింపులపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు డోవీపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) నిర్ణయాన్ని సవాలు చేస్తూ క్యాట్ ను ఆశ్రయించారు. అనంతరం వీరి వ్యవహారంపై డీవోపీటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చివరకు 2024లో నియమించిన ఖండేకర్ కమిటీ సిఫార్సు మేరకు ఈ ముగ్గురు ఐపీఎస్ లను ఏపీలో రిపోర్టు చేయాలని కేంద్ర హోం శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. ఈ ముగ్గురు తెలంగాణను వదిలి ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది.