పాప్ సింగర్‌కు మరణ శిక్ష.. కారణం అదే.!
ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులను తన గాత్రంతో సంపాదించుకున్న అమిర్ హుస్సేన్‌కు మరణ శిక్ష విధించడం ద్వారా ఇరాన్ కోర్టు సంచలనాన్ని సృష్టించింది.
By: Tupaki Desk | 20 Jan 2025 10:13 AM GMTపాప్ సింగర్ అమీర్ హుస్సేన్‌కు ఇరాన్ కోర్టు మరణశిక్ష విధించింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులను తన గాత్రంతో సంపాదించుకున్న అమిర్ హుస్సేన్‌కు మరణ శిక్ష విధించడం ద్వారా ఇరాన్ కోర్టు సంచలనాన్ని సృష్టించింది. ఈ మరణశిక్షకు కారణం కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మహమ్మద్ ప్రవక్తను అవమానించాడు అన్న కారణంతో ఈ పాప్ సింగర్‌కు మరణశిక్ష ఖరారయింది. గతంలోనూ ఇతడిపై కొన్ని రకాల ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా దేశద్రోహానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉండడంతోపాటు ఈ కేసులో 5 ఏళ్ల పాటు జైలు శిక్షను ఈ పాప్ సింగర్ అనుభవించాడు. ఈ క్రమంలోనే మళ్లీ రాసి క్యూట్ అభ్యంతరాలను ఆమోదించిన సుప్రీంకోర్టు కేసును రీ ఓపెన్ చేసింది. దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో మరోసారి అమీర్ హుస్సేన్ ను విచారించారు. కోర్టుకు అమీర్ హుస్సేన్ దేశద్రోహానికి పాల్పడిన దానికి సంబంధించిన ఆధారాలను అందించడంతో మరణశిక్షను కోర్టు ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఈ తీర్పు అనంతరం అమీర్ హుస్సేన్‌కు కోర్టు ఒక వెసులుబాటును కల్పించింది. ఈ శిక్షను అప్పీల్ చేసుకునే అవకాశాన్ని అమీర్‌కు కల్పించారు. దీంతో ఆయన ఉన్నత స్థాయిలో కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అమీర్ హుస్సేన్ తాను ఎటువంటి నేరానికి పాల్పడలేదని, దేశద్రోహానికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదంటూ స్థానిక మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మరణశిక్ష వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
తన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న అమీర్ హుస్సేన్‌కు మగ్ సౌద్దూకు ఇరాన్ కోర్టు మరణశిక్షను విధించింది. మరి దీనిపై ఆయన ఉన్నత స్థాయి కోర్టుకు వెళతారా..? లేదా అన్నది ఆసక్తిగా మారింది. తాను ఏ తప్పు చేయలేదని వ్యాఖ్యానిస్తున్న అమీర్ హుస్సేన్.. ఉన్నత స్థాయికి అప్పీల్ చేసుకునే విషయాన్ని మాత్రం ఎవరికీ వెల్లడించడం లేదు.
గతంలోనూ అమీర్ హుస్సేన్‌పై అనేక ఆరోపణలను ఎదుర్కొన్నారు. అనేకచోట్ల ఇతను పై కేసులు కూడా నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో జైలు శిక్షణ కూడా అనుభవించాడు. మంచి ప్రతిభావంతుడు అయినప్పటికీ అనేక వివాదాల్లో చిక్కుకోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. తాజాగా మహమ్మద్ ప్రవక్తను అవమానించాడు అన్న ఆరోపణలు నేపథ్యంలో కేసులను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే మరణశిక్ష కూడా ఆయనకు పడడం గమనార్హం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు.