ఒక డాలర్ కు ఇరాన్ కరెన్సీ ఇచ్చేదెంతో తెలుసా?
ఆ దేశ అధిపత్యాన్ని ప్రశ్నిస్తే.. సదరు దేశానని నామరూపాల్లేకుండా చేసేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించటం అమెరికాకు అలవాటే
By: Tupaki Desk | 19 Dec 2024 10:30 AM GMTఅగ్రరాజ్యం అమెరికాతో పెట్టుకుంటే అంతే. ప్రపంచంలో ఎవరైనా కావొచ్చు. ఆ దేశ అధిపత్యాన్ని ప్రశ్నిస్తే.. సదరు దేశానని నామరూపాల్లేకుండా చేసేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగించటం అమెరికాకు అలవాటే. ఆ దేశాన్ని అమితంగా ద్వేషించే దేశాల్లో ఇరాన్ ఒకటిగా నిలుస్తుంది. ఇందుకు తగ్గట్లే.. ఇప్పుడా దేశ కరెన్సీ దారుణంగా పడిపోయింది. అదెంతో తెలిస్తే నోట మాట రాదంతే. ఒక అమెరికా డాలర్ కు మన రూపాయి మారకం చూస్తే.. దగ్గర దగ్గర రూ.84 ఉంటుంది.
అదే ఇరాన్ కరెన్సీ (రియాల్)తో మారకం చూస్తే.. షాక్ తినాల్సిందే. ఎందుకంటే ఒక డాలర్ కు ఇరాన్ రియాల్స్ ఇచ్చేదెంత అంటే.. అక్షరాల 7,77,000. అంటే 7.77 లక్షలన్న మాట. ఈ లెక్కన మీ దగ్గర 10 డాలర్లు ఉంటే ఆ మొత్తం రూ.77 లక్షలకు పైనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇరాన్ రియాల్ విలువ గడిచిన నవంబరులో దగ్గర దగ్గర 10 శాతం వరకు పడిపోవటం గమనార్హం.
ఎప్పుడైతే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారో.. ఆ వెంటనే ఇరాన్ కరెన్సీ విలువ మరింత కుంగింది. శక్తివంతమైన దేశాలతో ఇరాన్ అణుఒప్పందం కుదుర్చుకున్న వేళ ఒక అమెరికా డాలర్ ఇరాన్ కరెన్సీతో మారకం విలువ రూ.32వేలుగా ఉండేది. అయితే.. ఇబ్రహీం రైసీ మరణం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి.
ఈ ఏడాది ఇరాన్ అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరాన్ కరెన్సీ మరింత కుంగింది. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన వేళ.. రియాల్ తో డాలర్ మారకం విలువ 7.03 లక్షల రియాల్స్ కు పతనమైంది. అదిప్పుడు ఏకంగా 7,77000కు పడిపోయింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే ఏడాది క్రితం ఇదే రియాల్ ఒక డాలర్ కు 5,00,500గా ఉండేది. ఏడాది వ్యవధిలో ఎంత దారుణంగా పడిపోయిందో ఇట్టే అర్థమవుతుంది. అమెరికానా..మజాకానా?