Begin typing your search above and press return to search.

వాళ్లకు ట్రంప్ ను చంపే ఉద్దేశ్యం లేదంట.. మెసేజ్ పెట్టారు!

ఇటీవల అత్యంత రసవత్తరంగా సాగిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్స్ లో.. డొనాల్డ్ ట్రంప్ పై వరుస హత్యాయత్నాలు అనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Nov 2024 4:36 PM GMT
వాళ్లకు ట్రంప్  ను చంపే ఉద్దేశ్యం లేదంట.. మెసేజ్  పెట్టారు!
X

ఇటీవల అత్యంత రసవత్తరంగా సాగిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత హాట్ టాపిక్స్ లో.. డొనాల్డ్ ట్రంప్ పై వరుస హత్యాయత్నాలు అనే సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల సమయంలో అభ్యర్థుల మధ్య విమర్శలు, ప్రజలకిచ్చే హామీలు ఒకత్తు అయితే... రిపబ్లికన్ అభ్యర్థి పై జరిగిన వరుస హత్యాయత్నాలు మరోకెత్తు.

ఆ సమయంలో... రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై వరుస హత్యాయత్నాలు జరగడం వెనుక ఇరాన్ హస్తం ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు బలంగా వినిపించాయి. దీంతో... ఆ దేశానికి అగ్రరాజ్యం నుంచి తీవ్ర హెచ్చరికలు వెళ్లాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ స్పందించింది.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ పై వరుస హత్యాయత్నాలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇరాన్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన వేళ తాజాగా ఆ దేశం స్పందించింది. ఇందులో భాగంగా... తమకు అలాంటి ఉద్దేశ్యం లేదని చెబుతూ బైడెన్ ప్రభుత్వానికి మెసేజ్ పంపింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది!

వాస్తవానికి అమెరికా ఎనికల ప్రచార సమయంలో ట్రంప్ పై హత్యాయత్నాలు జరిగినప్పుడు ట్రంప్ ప్రచార బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ హయాంలో జరిగిన ఇరాన్ మేజర్ ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారంగానే టెహ్రాన్ ఈ కుట్రలకు పాల్పడుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అమెరికాలో అస్థిరత, గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తుందని పేర్కొంది.

ఈ క్రమంలోనే బైడెన్ ప్రభుత్వం టెహ్రాన్ కు గట్టి హెచ్చరికలు పంపింది. ఇందులో భాగంగా.. ట్రంప్ కు హాని తలపెట్టాలని చూస్తే.. యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా దాన్ని పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ స్పందించింది.

ఇందులో భాగంగా... సులేమానీ హత్య నేరపూరిత చర్యే అని.. దీనిపై తాము అంతర్జాతీయ న్యాయ మార్గాలను అనుసరిస్తామని.. అంతే తప్ప హింసాత్మక ఘటనతో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం లేదని.. అసలు ట్రంప్ ను హత్య చేసే ఉద్దేశ్యం తమకు లేదని ఇరాన్ సందేశం పంపినట్లు చెబుతున్నారు.