టెన్షన్ టెన్షన్... వైరల్ గా ఇజ్రాయేల్ – ఇరాన్ బలాబలాలు!
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు ఉరుముతున్నాయి.
By: Tupaki Desk | 14 April 2024 1:34 PM GMTఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు ఉరుముతున్నాయి. ఇప్పటికే రష్యా - యుక్రెయిన్, ఇజ్రాయేల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం పీక్స్ లో సాగుతున్న నేపథ్యంలో... ఇప్పుడు ఇజ్రాయేల్ పై ఇరాన్ దాడులు వైరల్ గా మారుతున్నాయి. దీంతో.. మూడో ప్రపంచ యుద్ధం మొదలవ్వబోతుందని ఒకరంటే.. మొదలైనట్లే అని మరొకరంటున్న వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆందోళన కరంగా ఉన్నాయని అంటున్నారు!
ఈ సమయంలో ఇజ్రాయేల్ పై ఇరాన్ దాడుల జరుపుతున్న దాడులపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇందులో భాగంగా... భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని నెతన్యాహుకు చెప్పినట్లు తెలిపిన బైడెన్.. ఈ నేపథ్యంలో శత్రువులు తనను ఏమీ చేయలేరని వెల్లడించినట్లైందని అన్నారు. ఇదే సమయంలో... ఇజ్రాయెల్ కు అమెరికా ఉక్కుకవచంలా ఉండటానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.
ఇదే క్రమంలో... ఇజ్రాయేల్ లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేసినట్లు ప్రకటించిన జోబైడెన్... తమ సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారని కొనియాడుతూ, భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తామని వెల్లడించారు. ఇదే క్రమంలో... ఇరాన్ చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సమయంలో ఈ ఇరుదేశాలు కలిగిఉన్న మిలటరీ బలం ఇప్పుడు తీవ్ర ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా.. ఇరాన్ కు 6.1 లక్షల సైన్యం ఉందని చెబుతుండగా.. ఇజ్రాయేల్ కు మాత్రం 1.7 లక్షల సైన్యం ఉందని తెలుస్తుంది. ఈ సమయంలోనే అగ్రరాజ్యం అమెరికా.. ఇజ్రాయేల్ కు అన్నిరకాలుగానూ సహకరిస్తున్నట్లు తెలుస్తుంది!
ఇక యుద్ధ విమానాల విషయానికొస్తే... ఇరాన్ కు 551 యుద్ధవిమానాలు ఉండగా.. ఇజ్రాయేల్ కు 612 ఉన్నాయి. ఇదే క్రమంలో... ఇరాన్ కు 186 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా, ఇజ్రాయేల్ కు 241 ఉన్నాయి. ఇక హెలీకాప్టర్ల విషయానికొస్తే... ఇరాన్ కు 13, ఇజ్రాయేల్ కు 48 ఉండగా... 1996 యుద్ధ ట్యాంకర్లు ఇరాన్ కు, 1370 యుద్ధ ట్యాంకర్లు ఇజ్రాయేల్ అంబులపొదిలోనూ ఉన్నాయి. ఇక సబ్ మెరైన్ల విషయానికొస్తే... ఇరాన్ కు 19, ఇజ్రాయేల్ కు 5 ఉన్నాయి!!
ఈ సమయంలో ఇరాన్ ప్రయోగించిన దాదాపు 70కిపైగా డ్రోన్లు, మూడు బాలిస్టిక్ క్షిపణులను అమెరికా దళాలు కూల్చివేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ఇప్పటికే ధ్రువీకరించారు.
భారత్ రియాక్షన్!:
ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్ లను ప్రయోగించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. దీంతో అక్కడున్న మన పౌరులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అక్కడున్న భారతీయులు అంతా అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు జారీ చేసింది. ఆందోళన చెందొద్దని పౌరులకు ధైర్యం చెప్పింది. ఇదే సమయంలో... ఇజ్రాయేల్ - ఇరాన్ దేశాలు సంయమనంతో శాంతి మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.