Begin typing your search above and press return to search.

ప్రపంచానికి కొత్త టెన్షన్... ఆ దేశం యుద్ధ విన్యాసాలు స్టార్ట్!

ఒక పక్క రష్యా - ఉక్రెయిన్ యుద్ధం అవిరామంగా సాగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Oct 2023 4:24 AM GMT
ప్రపంచానికి కొత్త టెన్షన్... ఆ దేశం యుద్ధ విన్యాసాలు స్టార్ట్!
X

ఒక పక్క రష్యా - ఉక్రెయిన్ యుద్ధం అవిరామంగా సాగుతున్న సంగతి తెలిసిందే. సుమారు 611 రోజులుగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ సుమారు 10వేల మంది మరణించగా 18,000 మంది వరకూ గాయపడ్డారని తెలుస్తుంది. దానికి తోడు తాజాగా ఇజ్రాయేల్ పై హమాస్ దాడి చేయడం.. దానికి ఇజ్రాయేల్ తనదైన శైలిలో ప్రతిదాడి మొదలుపెట్టడంతో.. యుద్ధం మొదలైంది! ఈ నేపథ్యంలో... మరో దేశం యుద్ధ విన్యాసాలు స్టార్ట్ చేయడంతో... మూడో ప్రపంచ యుద్ధం టాపిక్స్ తెరపైకి వచ్చాయి.

అవును... ఇప్పటికే రష్యా - ఉక్రెయిన్, ఇజ్రాయేల్ – హమాస్ మధ్య యుద్ధాలు తీవ్రస్థాయిలో జరుగుతుండటంతో... ఈ యుద్ధాలను ఎలాగైనా ఆపాలని ప్రపంచ దేశాలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు! ఈ సమయంలో... ఇజ్రాయేల్ - హమాస్ యుద్ధంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా, కెనడా మొదలైన దేశాలన్నీ ఇజ్రాయేల్ కు మద్దతు ఇస్తూ.. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుండగా.. మరికొన్ని దేశాలు మాత్రం పాలస్తీనాకు మద్దతు పలుకుతూ హమాస్ కు పరోక్షంగా సహకరిస్తున్నాయి!

ఈ నేపథ్యంలో... ఇరాన్ సైన్యం 200 హెలికాప్టర్లతో యుద్ధ విన్యాసాలు ప్రారంభించింది. ఈ సమాచారాన్ని ఇరాన్ మీడియా ప్రపంచం ముందు వెల్లడించింది. ఈ విషయాలపై స్పందించిన ఇరాన్ ఆర్మీ కమాండర్‌... ఈ మాక్ డ్రిల్ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇరాన్‌ కున్న శత్రువులను హెచ్చరించడమేనని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధంలో హమాస్‌ కు ఇరాన్‌ బహిరంగంగా మద్దతు ఇస్తోన్న సంగతి తెలిసిందే.

దీంతో... ఇజ్రాయేల్ – హమాస్ మధ్య యుద్ధం ఇలానే కొనసాగితే.. గాజా గజగజ లాడటం కంటిన్యూ అయితే.. ఇజ్రాయేల్ భూతలదాడులను మొదలుపెడితే.. మిడిల్ ఈస్ట్ దేశాలు చేస్తున్న మద్యవర్దిత్వాన్ని లైట్ తీసుకుంటే.. ఇరాన్ కూడా ఈ యుద్ధంలోకి ఎంటరయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే... యూఎస్, బ్రిటన్ ల సహకారం ఇజ్రాయేల్ కు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ సమయంలో పాలస్థీనాకు మద్దతుగా రష్యాతో పాటు, కొన్ని అరబ్ కంట్రీల రంగప్రవేశం కూడా అనివార్యం అయ్యే అవకాశాలు లేకపోలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందేహాలకు బలం చేకూరుస్తూ... తాజాగా ఈ యుద్ధ విన్యాశాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ కూడా స్పందించారు. ఇందులో భాగంగా ఒక ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్‌ కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు.

ఈ క్రమంలో... గాజాపై ఇజ్రాయెల్ తన యుద్ధ నేరాలను ఆపకపోతే, ఆ దేశం ఇతర కూటములతో కూడా పోరాడాల్సిన దుస్థితికి చేరుకుంటుందని, అప్పుడు ఆ దేశం ఎదుర్కోబోయే పరిస్థితులను ఆపడం అసాధ్యమని ఈ సందర్భంగా హెచ్చరించారు. దీంతో... ఇరాన్‌ హెచ్చరికలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయని పరిశీలకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.