Begin typing your search above and press return to search.

రైసీ దుర్మరణం.. తెరపైకి భయంకర ఉగ్ర సంస్థలు

విస్తీర్ణం రీత్యా ప్రపంచంలోని పెద్ద దేశాల్లో ఒకటైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలవడం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   20 May 2024 9:25 AM GMT
రైసీ దుర్మరణం.. తెరపైకి భయంకర ఉగ్ర సంస్థలు
X

విస్తీర్ణం రీత్యా ప్రపంచంలోని పెద్ద దేశాల్లో ఒకటైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలవడం సంచలనంగా మారింది. ఇది కేవలం ప్రమాదమా? మరేదైనా కుట్ర కోణం ఉందా? అనే అనుమానాలు ఇప్పటికే కొంత వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు భయంకర ఉగ్ర సంస్థలు స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవి రెండూ ఇజ్రాయెల్ కు వ్యతిరేకమే. అయితే, ఇరాన్ అధ్యక్షుడి మరణంపై మాత్రం వాటి స్పందన అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

బంధం బయటపడింది..

రైసీ దుర్మరణంపై హెజ్బొల్లా, హమాస్ స్పందించడం

ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రెండూ ఇరాన్‌ తో సుదీర్ఘకాలంగా అసోసియేట్ అయి ఉన్నాయి. రైసీ మరణించినట్లు అధికారిక ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే వేర్వేరుగా సంతాపం తెలియజేశాయి రైసీని ఇస్లామిక్ విప్లవ జ్యోతిగా, అత్యున్నత నాయకుడిగా, మహోన్నతుడిగా అభివర్ణించాయి. ఇరాన్ ప్రజల ఆవేదనను పంచుకుంటున్నామని వెల్లడించాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌ కు పూర్తి సంఘీభాభవం తెలియజేశాయి. ఇరాన్ పునరుజ్జీవనంలో రైసీది కీలక పాత్ర అని కొనియాడాయి.

పాలస్తీనా ప్రస్తావన

ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాదాపు యుద్ధం జరిగినంత పనైంది. చివరి నిమిషంలో అది ఆగిపోయింది. కాగా, రైసీని పాలస్తీనా అథారిటీ, జియోనిస్ట్ అస్తిత్వానికి వ్యతిరేకంగా, ప్రజల తరఫున న్యాయబద్ధమైన పోరాడిన నాయకుడిగా హమాస్, హెజ్బొల్లా పేర్కొన్నాయి. ఈ రెండు ఉగ్ర సంస్థల స్పందన అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇరాన్ కు వీటితో ఉన్న అనుబంధం బయటపడిందని కొందరు పేర్కొంటున్నారు.

ఇరాన్ వెన్నుదన్ను

హమాస్ సంగతేమో కానీ.. హెజ్బొల్లాకు అన్నీ ఇరానే. ఈ ఉగ్ర సంస్థ సభ్యులకు సైనిక శిక్షణ కూడా ఇస్తోంది. ఇటీవల హెజ్బొల్లా నేరుగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పాల్గొనాలని చూసినా ఇరాన్ జోక్యంతో ఆగింది. హెజ్బొల్లా దిగితే యుద్ధం తీవ్రమై.. ఆయుధాలు అయిపోతాయని ఇరాన్ భయపడింది.