Begin typing your search above and press return to search.

శ్రీతేజ్ వద్దకు అల్లు అర్జున్ ఫ్యామిలీ!!

ఈ సమయంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ శ్రీతేజ్ ను పరామర్శించనున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2024 8:24 AM GMT
శ్రీతేజ్  వద్దకు అల్లు అర్జున్  ఫ్యామిలీ!!
X

సంధ్య థియేటర్ లోని తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ అప్పటి నుంచి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకూ వెంటిలేటర్ పై ఉన్న శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కాస్త కుదుటిపడుతుందన్నట్లుగా సమాచారాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ శ్రీతేజ్ ను పరామర్శించనున్నారని అంటున్నారు.

అవును... సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ కిమ్స్ లో చికిత్స పోందుతున్నారు. ఈ సమయంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీతేజ్ ను పరామర్శిస్తున్నారు. ఈ సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు సాయం అందించారు.

మరోపక్క... పుష్ప-2 నిర్మాతలు బాలుడిని పరామర్శించి రూ.50 లక్షల చెక్ ను మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ విషయాలపై స్పందించిన బాలుడి తండ్రి భాస్కర్... వీరితో పాటు అల్లు అర్జున్ రూ.10 లక్షల డీడీ అందించినట్లు తెలిపారు. ఇక దర్శకుడు సుకుమారు ఇప్పటికే పరామర్శించి వెళ్లినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ వెళ్లి బాలుడిని పరామర్శించారు. అల్లు అర్జున్ రాకపోవడానికి కారణం న్యాయవాదుల సలహా అని తెలిపారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు శ్రీతేజ్ ను పరామర్శించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వారు కిమ్స్ కి వెళ్లబోతున్నారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా... ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు సుకుమార్, అల్లు అరవింద్ తో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు కిమ్స్ కు వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా బాలుడి తండ్రి భాస్కర్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది.