బాబు మారారు: ఉద్యోగుల టాక్
ఇటీవల సంక్రాంతిని పురస్కరించుకుని 670 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది.
By: Tupaki Desk | 14 Jan 2025 12:30 PM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాబు మారారు! అంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అయితే.. ఇదేదో.. తమకు కానుకలు ఇచ్చారో.. పెండింగు వేతనాలు, బిల్లులు చెల్లించారనో కాదు. చంద్రబాబు వ్యవహార శైలిలోనే వచ్చిన మార్పును వారు గమనిస్తున్నారు. దీనిని ప్రస్తావిస్తూనే వారు బాబు మారారు.. అంటూకామెంట్లు చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతిని పురస్కరించుకుని 670 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ సొమ్ములు ఇవ్వడం సహజంగానే ఉద్యోగులకు ఆనందం కలిగించే విషయం. అయితే.. ఇంతకు మించిన ఆనందంతో ఉద్యోగులు ఉన్నారు. దీనికి కారణం.. పనిభారం తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగు లు వేస్తోంది. నిజానికి చంద్రబాబు హయాం అంటేనే.. పనిగంటల్లో నిక్కచ్చిగా ఉంటారని.. పనితీరు కరెక్ట్ గా ఉండాలని ఒత్తిడి చేస్తారనే పేరుంది. 1995 నాటి ముఖ్యమంత్రిగా ఆయన ఉద్యోగులను పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు-చంద్రబాబుకు మధ్య గ్యాప్ పెరిగింది.
ఈ గ్యాప్ ఏళ్ల తరబడి అలానే ఉండిపోయింది. తాజాగా దీనిని తగ్గించుకునేందుకు చంద్రబాబు ప్రయ త్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఉద్యోగ సంఘాల డిమాండ్లను పనరిష్కరించేందుకు ప్రయత్ని స్తున్నారు. ఇదేసమయంలో సెలవుల విషయంలో లిబరల్‌గా ఉంటున్నారు. తాజాగా కనుమకు సెలవు లేదు. కానీ, ఉద్యోగ సంఘాలు విన్నవించడంతో రాత్రికి రాత్రి సెలవు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకు న్నారు. ఇదే సమయంలో బదిలీల విషయంలోనూ పనితీరును ప్రామాణికంగా తీసుకుని.. మరింత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చిఇక్కడ పనిచేస్తున్నవారికి వారంలో ఐదు రోజుల పనివిధానాన్ని కూడా.. ఇటీవ ల మరోసారి రెన్యువల్ చేశారు. ఈ పరిణామాలుఉద్యోగుల్లో చంద్రబాబుకు పాజిటివిటీని పెంచుతున్నా యి. ఇక, పనితీరు విషయంలోనూ చంద్రబాబు తన పంథాను మార్చుకున్నారు. ఎన్ని గంటలు పనిచేశా రన్నది కాదు.. ఎంత ప్రొడక్టివిటీగా పనిచేశారన్నది చూస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత కార్యాలయాల్లో ఉండొద్దన్న ఆదేశాలను కూడా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు.. బాబు మారారు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ తరహా మార్పుతో ప్రభుత్వం పనితీరు కూడా మారే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.