Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల‌కు బాధ్య‌త.. మ‌రింత ముప్పే.. !

ఈ విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్టీ సీనియ‌ర్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   29 Jan 2025 8:30 PM GMT
త‌మ్ముళ్ల‌కు బాధ్య‌త.. మ‌రింత ముప్పే.. !
X

సొంత పార్టీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ప‌నులు అప్ప‌గించ‌డం త‌ప్పుకాదు. అవ‌స‌రం కూడా. కానీ, స‌మ‌యం సంద‌ర్భం చూసుకుని కొన్ని కొన్ని బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల్సి ఉంటుంది. లేక‌పోతే.. వైసీపీ మాదిరిగా.. ఇబ్బందులు కొనితెచ్చుకున్న‌ట్టే అవుతుంది. ఈ విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్టీ సీనియ‌ర్లు చెబుతున్నారు. తాజాగా త‌మ్ముళ్ల‌కు చంద్ర‌బాబు కొన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

వీటిలో ప్ర‌ధానంగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూట‌మిస‌ర్కారు ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేయాల‌ని అన్నారు. కానీ.. త‌మ్ముళ్లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ, ఏడు మాసాల త‌ర్వాత కూడా.. కూట‌మి ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డం లేదంటూ.. వైసీపీనాయ‌కులు ప్ర‌చారం చేయ‌డంతో ప్ర‌జ‌ల నుంచి కూడా అదే త‌ర‌హా స్పంద‌న వ‌స్తోంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. దీంతో వైసీపీపై ఎదురు దాడి చేయాల‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ వారికి గ‌ట్టిగా స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న సూచించారు.

ఈ బాధ్య‌త‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ తీసుకోవాల‌ని కూడా.. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను చంద్ర‌బాబు కోరారు. అయితే.. ఇలా చేయ‌డం స‌రికాద‌న్న‌ది సీనియ‌ర్ల వాద‌న‌. ఎందుకంటే.. కార్య‌క‌ర్త‌లు, జూనియ‌ర్ నాయ‌కు లు తెలిసీ తెలియ‌క ఏవైనా కామెంట్లు చేస్తే.. దాని వ‌ల్ల కూట‌మి ప్ర‌భుత్వం ఇబ్బందుల్లో ప‌డే ప్ర‌మాదం ఉంటుంద‌ని అంటున్నారు. రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై ఇంకా చాలా మంది కార్య‌క‌ర్త‌ల‌కు అవ‌గాహ‌న లేద‌ని వారు చెబుతున్నారు.

అస‌లు కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి ఏడు మాసాలే అయినందున‌.. ఇప్ప‌టికిప్పుడు అస‌లు ప‌థ‌కాల‌పై చ‌ర్చ పెట్ట‌డం కూడా త‌ప్పేన‌ని చెబుతున్నారు. వైసీపీ నేత‌లు చేసే ప్ర‌చారం చేసుకున్నా.. కూట‌మి స‌ర్కారు చేస్తున్న ప‌నుల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని.. కాబ‌ట్టి ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన ఇబ్బంది లేద‌ని అంటు న్నారు. మ‌రో ఏడాది ఆగిన త‌ర్వాత‌..ఈ విష‌యాలు చూసుకోవ‌చ్చ‌ని.. అప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉండ‌డ‌మే మేల‌ని అంటున్నారు. పైగా.. జూనియ‌ర్లు, కార్య‌క‌ర్త‌ల‌కు అస‌లు ఈ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు.