Begin typing your search above and press return to search.

కంట్రోల్ లేని గందరగోళం.. దయా మార్గం..విడాకుల వేళ చాహల్‌ పోస్టు వైరల్

ప్రేమించి పెళ్లాడిన కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో వైవాహిక బంధం ముగింపునకు రావడంతో చాహల్ నిర్వేదానికి గురవుతున్నాడు.

By:  Tupaki Desk   |   1 March 2025 11:57 AM GMT
కంట్రోల్ లేని గందరగోళం.. దయా మార్గం..విడాకుల వేళ చాహల్‌ పోస్టు వైరల్
X

టీమ్ ఇండియాకు దూరమైన స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ప్రస్తుతం వ్యక్తిగతంగానూ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రేమించి పెళ్లాడిన కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో వైవాహిక బంధం ముగింపునకు రావడంతో చాహల్ నిర్వేదానికి గురవుతున్నాడు. కొన్నేళ్ల కిందట ధనశ్రీని పెళ్లాడిన చాహల్ ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. ఇద్దరూ కలిసి రీల్స్ చేసేవారు.

కానీ, ఏమైందో ఏమో.. వీరిద్దరి విడాకులకు సంబంధించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో చాహల్‌ భార్య ధనశ్రీతో కలిసి ఒకప్పుడు రీల్స్ చేసిన ఇన్‌ స్టాగ్రామ్ లోనే ఓ పోస్టు పెట్టాడు. అదిప్పుడు వైరల్‌ గా మారింది. ‘నియంత్రణ లేని గందరగోళ పరిస్థితుల్లో దయతో ఉండడమే చాలా మంచి పని’’ అని ఇన్ స్టాలో చాహల్ రాసుకొచ్చారు. దీంతో దీని అర్థం ఏమిటా? అని క్రికెట్ అభిమానులు వెదుకులాటలో పడ్డారు. ఈ ప్రకారం చూస్తే చాహల్ తీవ్ర సందిగ్ధంలో ఉన్నాడని కొందరు విశ్లేషిస్తున్నారు.

కాగా, చాహల్‌ టీమ్ ఇండియా సభ్యుడిగా ఉన్న సమయంలో.. అంటే 2020లో ధనశ్రీవర్మను పెళ్లాడాడు. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో వీరిద్దరూ యాక్టివ్‌ గా కనిపించేవారు. అభిమానులకు సమాధానాలిచ్చేవారు. అయితే, ఇటీవల ఒకరినొకరు అన్‌ ఫాలో చేసుకున్నారు. ధనశ్రీ చాహల్‌ పదాన్ని తొలగించింది. దీంతో ఇద్దరూ విడిపోతున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. చాహల్‌, ధనశ్రీ వ్యక్తిగతంగా హాజరవగా ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసుపై ఇటీవల తుది విచారణ జరిగిందట.

జడ్జి ఆదేశాలతో 45 నిమిషాల కౌన్సెలింగ్‌ చేసినా విడిపోయేందుకే చాహల్, ధనశ్రీ నిర్ణయించుకున్నారు. దీంతో విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ‘ఒత్తిడి నుంచి విముక్తి’ అంటూ ధనశ్రీ దీనిపై స్పందించింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లుగా గుర్తించేలోపే దేవుడు బయట పడేశాడని చాహల్ స్పందించాడు. చాహల్ మరోవైపు రూ.60 కోట్ల భరణం ఇచ్చినట్లు వార్తలు రాగా ధనశ్రీ కుటుంబం తోసిపుచ్చింది.