బన్నీ కోసం కదిలిన సినీ ప్రముఖులు... నాంపల్లి కోర్టు వద్దకు చిరంజీవి!!
మరోపక్క సోమవారం వరకూ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకూడదంటూ ఆయన తరుపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.
By: Tupaki Desk | 13 Dec 2024 9:09 AM GMTసంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో... అల్లు అర్జున్ ని రిమాండ్ కు తరలించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. మరోపక్క సోమవారం వరకూ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకూడదంటూ ఆయన తరుపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ ను లంచ్ మోషన్ పిటిషన్ గా విచారణ జరపాలని.. ఇదే సమయంలో సోమవారం వరకూ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు! మరోపక్క అల్లు అర్జున్ కోసం నాంపల్లి కోర్టు వద్దకు సినీ ప్రముఖులు చేరుతున్నారని అంటున్నారు.
అవును... అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి.. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారని అంటున్నారు. ఈ సందర్భంగా రిమాండ్ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో అల్లు అర్జున్ కోసం పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
మరోవైపు ఇంకొంతమంది నేరుగా నాంపల్లి కోర్టు వద్దకు చేరుకుంటున్నారని అంటున్నారు. ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి బన్నీ కోసం కోర్టు వద్దకు బయలుదేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే... హైకోర్టు విచారణ అనంతరం చిరు నాంపల్లి కోర్టుకు బయలుదేరే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు.. దిల్ రాజుతో పాటు పలువురు సెలబ్రెటీలు చిక్కడపల్లి స్టేషన్ లో బన్నీని కలిసినట్లు చెబుతున్నారు! ఇక ఈ సమయంలో అల్లు అర్జున్ వెంట బన్నీ వాసు ఉన్నారు!