Begin typing your search above and press return to search.

ధర్మాన కుమారుడు జనసేనలోకి ?

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి పుకార్లకు కూడా రెక్కలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   26 Oct 2024 2:48 PM GMT
ధర్మాన కుమారుడు జనసేనలోకి ?
X

ఇది గాసిప్ లాంటి ప్రచారంగా ఉంది. నిజంగా ఇలాంటివి రాజకీయాల్లో తరచూ జరుగుతుంటాయి. ఫలనా వారు ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు అని ముందే చెబుతూంటారు. నిజంగా అలా జరుగుతుందా అంటే జరగవచ్చు లేక ఆగవచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి పుకార్లకు కూడా రెక్కలొస్తున్నాయి.

ఇదిలా ఉంటే అలాంటి పుకారు లాంటి ప్రచారం ఒకటి వెలుగు చూస్తోంది. అదేంటి అంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు జనసేనలోకి జంప్ చేస్తున్నారు అన్నది. ఇది నిజంగా జరుగుతోందా అంటే ఏమో తెలియదు కానీ ప్రచారం అలా సాగుతోంది.

మరో వైపు చూస్తే ఒక్కటి మాత్రం నిజం అని అంటున్నారు. వైసెపీలో అయితే ధర్మాన ప్రసాదరావు అంత యాక్టివ్ గా లేరు అని అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు వైసీపీ ఓటమి చెందాకా ఎక్కడా కనబడటం లేదని అంటున్నారు. వైఎస్సార్ జయంతులు వర్ధంతులు ఈ మధ్యలో వచ్చి వెళ్లాయి. కానీ ప్రసాదరావు మాత్రం ఎక్కడా లేరు.

మరో వైపు చూస్తే జగన్ సమీక్షా సమావేశాలకు కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి నాయకులు అటెండ్ అవుతున్నారు కానీ ప్రసాదరావు కనిపించడం లేదు. దాంతో ఆయన వేరే ఆలోచనలు చేస్తున్నారా లేక రాజకీయ వైరాగ్యమా అన్నది తెలియడంలేదు అంటున్నారు.

ఇక ధర్మాన ప్రసాదరావు టీడీపీలో చేరుతారు అని కూడా అంటూ వచ్చారు. అయితే అది పుకారుగానే మిగిలిపోయింది. ఇపుడు జనసేనలోకి ఆయన కుమారుడు రాం మనోహర్ నాయుడు వెళ్తారు అని అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు విషయానికి వస్తే ఆయనకు రాజకీయంగా పెద్దగా కోరికలు లేవు అనే అంటున్నారు.

ఆయన కీలక మంత్రిత్వ శాఖలు ఎన్నో చేశారు. ఆయన ఇపుడు చూస్తున్నది తమ కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే అని అంటున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో కూడా తన కుమారుడికి టికెట్ ఇవ్వమని వైసీపీ హై కమాండ్ ని కోరారు అని చెబుతారు. అయితే జగన్ మాత్రం ప్రసాదరావునే పోటీ చేయమన్నారు. ఆయన పోటీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు.

దాంతో ఆయన కొంత వైరాగ్యానికి లోను అయ్యారు అని అంటారు. ఇక ఇపుడు తాను తప్పుకుని తన కుమారుడిని ఒక రాజకీయ పార్టీలో చేర్చాలని చూస్తున్నారు అని అంటున్నారు. టీడీపీలో అయితే అక్కడ అంతా కిటకిటలాడుతఒంది. దాంతో జనసేనలో వైపు చూస్తున్నారు అని కూడా అంటున్నారు.

జనసేనలో అయితే శ్రీకాకుళం జిల్లాలో పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు అనే చెబుతున్నారు. ఎందుకంటే ఈ జిల్లాలో జనసేనకు బలపడాలంటే మంచి ఊతం కావాల్సి ఉంది. ధర్మాన ప్రసాదరావు కుటుంబం రాజకీయంగా దశాబ్దాలుగా పాలిటిక్స్ లో ఉంది దాంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు

ఈ క్రమంలో ఆయన కనుక జనసేన వైపు చూస్తే కచ్చితంగా రెండు వైపులా లాభమే అని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది పుకారుగా ఉన్నా వర్కౌట్ అయ్యేలా ఉందని కూడా అంటున్నారు. వైసీపీ నుంచి తొందరలో ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు కొందరు చేరుతారు అని అంటున్నారు. అలాంటి వారి లిస్ట్ లో శ్రీకాకుళం నుంచి ప్రసాదరావు కుమారుడు కూడా ఉండొచ్చు అని ప్రసుతానికి జరుగుతున్న ప్రచారం. ఇందులో నిజమెంత ఉంది అన్నది వేచి చూడాల్సిందే.