Begin typing your search above and press return to search.

గద్దర్ సినిమా అవార్డులకు డేట్ ఫిక్సు

దీంతో.. పదేళ్లుగా తెలుగు సినిమా అవార్డులన్నవే లేకుండా పోయాయి.

By:  Tupaki Desk   |   19 Jan 2025 4:38 AM GMT
గద్దర్ సినిమా అవార్డులకు డేట్ ఫిక్సు
X

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నంది అవార్డుల పేరుతో తెలుగు చిత్రపరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వం అవార్డుల్ని ఇస్తూ సత్కరించటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంప్రదాయానికి కేసీఆర్ మంగళం పాడేశారు. దీంతో.. పదేళ్లుగా తెలుగు సినిమా అవార్డులన్నవే లేకుండా పోయాయి. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. నంది అవార్డుల స్థానే.. తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలా.. గద్దర్ పేరుతో సినిమా పురస్కారాలు ఇవ్వనున్నట్లుగా ప్రకటించి సంచలనానికి తెర తీశారు.

ఆ తర్వాత ఈ అంశం మీద పెద్దగా చర్చ జరగలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆసక్తికర ప్రకటన చేశారు. గద్దర్ సినిమా అవార్డులను తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన అందజేయాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయంలో శనివారం జరిగిన గద్దర్ అవార్డులకమిటీ సమావేశంలో పాల్గొన్న భట్టి.. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచన చేశారు.

సినీ పరిశ్రమను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో అవార్డుల ప్రదానం జరగలేదన్న భట్టి.. ‘‘గద్దర్ సినీ అవార్డుల్ని ప్రతి ఏడాది అందజేస్తాం. అవార్డుల కోసం లోగోతో సహా విధి విధానాల్ని.. నియమ నిబంధనల్ని కమిటీ చర్చింది’’అని ప్రకటించారు. దీంతో గద్దర్ అవార్డులకు సంబంధించిన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందన్న విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లుగా చెప్పాలి. ప్రభుత్వం నుంచి వెలువడిన ఈ ప్రకటనకు తెలుగు చిత్ర పరిశ్రమ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.