Begin typing your search above and press return to search.

జనసేనకు ఝలక్ ఇచ్చి టీడీపీలోకి..వాటే పాలిట్విస్ట్ !

అయితే ఇంతలోనే అంత మార్పు అన్నట్లుగా జెడ్పీ చైర్ పర్సన్ దంపతులు టీడీపీలోకి వెళ్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Sep 2024 1:30 AM GMT
జనసేనకు ఝలక్ ఇచ్చి టీడీపీలోకి..వాటే పాలిట్విస్ట్ !
X

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ఆమె భర్త ప్రసాదరావు ఇటీవలే వైసీపీకి గుడ్ బై కొట్టారు. ఆ సమయంలో ఆ దంపతులు చెప్పిన మాట ఏంటి అంటే తాము తొందరలోనే జనసేనలో చేరబోతున్నామని. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటామని కూడా ప్రకటించారు.

అయితే ఇంతలోనే అంత మార్పు అన్నట్లుగా జెడ్పీ చైర్ పర్సన్ దంపతులు టీడీపీలోకి వెళ్తున్నారు. జెడ్ పీ చైర్ పర్సన్ భర్త గంటా ప్రసాదరావు విశాఖకు వచ్చి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాము టీడీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. భర్త బాటలోనే పద్మశ్రీ కూడా టీడీపీలోకి వెళ్తున్నారు. ఈ ఇద్దరూ తొందరలో నారా లోకేష్ ని కలిసి టీడీపీలోకి ప్రవేశిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంగా ఈ దంపతులు జనసేన అని చెప్పారు.

పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆయన పార్టీలో చేరడం ద్వారా జిల్లా పరిషత్తును అభివృద్ధి చేసుకుని ప్రజలకు సేవ చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. మరి పవన్ పంచాయతీ రాజ్ ని పక్కన పెట్టేసి పసుపు పార్టీలో చేరడం పట్ల చర్చ సాగుతోంది.

కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో ఒక పార్టీలో చేరాల్సిన డెసిషన్ ని వేరొక పార్టీ వైపు ఎందుకు మార్చుకున్నారు అన్న దాని మీద చర్చ సాగుతోంది. అసలు గోదావరి జిల్లా రాజకీయం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు అని అంటున్నారు.

వైసీపీలో పుష్కర కాలం పాటు పనిచేసి ఆ పార్టీ ద్వారా పదవులు అందుకుని వ్యక్తిగత కారణాలు అని చెప్పి రాజీనామా చేశారు. ఈ మధ్యలో జనసేనలో చేరిక అన్నారు. ఇపుడు టీడీపీ అంటున్నారు. ఈ విధంగా జెడ్పీ లో రాజకీయం ఎన్నో మలుపులు తిరుగుతోంది.

మరో వైపు చూస్తే జనసేన గోదావరి జిల్లాలలో బలపడకూడదు అని భావించి ఎవరైనా వీరిని టీడీపీ వైపు లాగారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటిదాకా చూస్తే వైసీపీ నుంచి నూటికి తొంబై అయిదు శాతం చేరికలు అన్నీ టీడీపీలోకే సాగుతున్నాయి. కూటమి లో అందరూ ఉన్నారు కదా అని చెప్పి టీడీపీకే ఓటు వేస్తున్నారు.

మరి కూటమిలో భాగస్వామ్యంగా ఉంటూ జనసేన బీజేపీ ఏ విధంగా పటిష్టం కాకపోతే ఈ అధికారం ఎందుకు అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా అవకాశ వాద రాజకీయాల్లో ఇది సరికొత్త ట్విస్ట్ అని గోదావరి జిల్లాలలో చర్చించుకోవడం జరుగుతోంది.